Sunday, July 17, 2016

శీలా యూపీ సీఎం.. రోశయ్య తెలంగాణ సీఎం

2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రోశయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది?
అరేయ్ నీకేమన్నా పిచ్చా?,, రోశయ్య ఎంత సమైక్య రాష్ట్రానికి సీఎంగా పని చేసినా, ఇప్పుడాయన పక్క రాష్ట్రం వ్యక్తి.. అందునా తమిళనాడుకు గవర్నర్.. పైగా వృద్దాప్యం.. అసలీ వెర్రి ఐడియా ఎలా వచ్చిందిరా నీకు?
రోశయ్యను తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తప్పేముంది?.. నా అభిప్రాయం సరైందే..
అదెట్లారా అర్థం అయ్యేటట్లు చెప్పు?
గతంలో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పని చేసిన శీలా దీక్షిత్ ను రాబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటించిందిగా కాంగ్రెస్ పార్టీ?..
అయితే?..
ఈ లెక్కన రోశయ్యను కూడా తెలంగాణకు సీఎం అభ్యర్థిని చేస్తే తప్పేముంది?
అవున్రోయ్ నీ లాజిక్ బాగానే ఏంది... ఇంకొద్దిగా అర్థం అయ్యేటట్లు చెప్పు..
రోశయ్య, శీలా దీక్షిత్ ఇద్దరూ ముఖ్యమంత్రులుగా పని చేసిన వాళ్లే.. ఇద్దరికీ గవర్నర్ గిరీ అనుభవం కూడా ఉంది.. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులు కూడా.. వయో భారం ఇద్దరికీ అధనపు అర్హత..’
అవునవును ఈ విషయాల్లో ఇద్దరికీ సామీప్యత బాగానే ఉందిరా..
మరి శీలా బాటలోనే మన రోశయ్యను కూడా పొరుగు రాష్ట్రానికి సీఎం అభ్యర్థిగా ప్రకటించడం అసాధ్యమేమీ కాదు.. ఏమంటావ్?
నీ తర్కం బాగానే ఏడిచింది కానీ.. రోశయ్యను తెలంగాణ సీఎం అభ్యర్థిని ఎందుకు చేయాలి.. అదేదో ఆయన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కే తిరిగి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే సరిపోతుంది కదా?
కాంగ్రెస్ పార్టీకి ఇక ఏపీలో పుట్టగతులు లేవురా?.. అందుకే కొద్దో గొప్పో బలం ఉన్న తెలంగాణకు ఆ పెద్దాయనను సీఎం అభ్యర్థిని చేయాల్సిందే.. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ దివాలా తీసినందుకే కదా శీలాను యూపీకి పంపుతున్నది..
ఆర్నీ ఏ ఐడియా రా నీది.. నిన్ను అర్జంటుగా తీసుకుపోయి సోనియా గాంధీ కోటరీలో చేర్చాల్సిందేరా?..
హహ్హ.. హ్హ..
ఎందుకురా నవ్వుతున్నావ్?

లేకపోతే ఏందిరా.. శీలా దీక్షిత్ ఏమైనా ఈ వృద్దాప్యంలో యూపీకి సారధ్యం వహిస్తే, ఆ రాష్ట్రం వాళ్లు ఆహా ఓహో అంటూ గెలిపిస్తారనుకున్నావా?.. రోశయ్యను తెలంగాణకు సీఎం చేసినా ఒకటే.. శీలాను యూపీకి సీఎం చేసినా ఒక్కటే..

No comments:

Post a Comment