Saturday, July 30, 2016

ఎంసెట్ తో అయినా మారాలి ప్రభుత్వ మైండ్ సెట్..

డాక్టర్ అయ్యేందుకు మెడిసిన్ చేయాలని ఉవ్విల్లూడమే విద్యార్థులకు పాపమైంది. జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష ఉండాలా? వద్దా? అనే తర్జన భర్జన మొదలు, ఎంసెట్ పరీక్ష వరకూ అంతా గందరగోళమే. సుప్రీం కోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో బంతాటాడుకున్నాయి. ఈ వరుస పరిణామాల మధ్య లీకు వీరులు వ్యవహారాన్ని చక్కబెట్టుకున్నారు..
ఎంసెట్ 2 రద్దుచేయడం ఒకందుకు మంచిదే.. ప్రశ్నా పత్రం లీకేజీ కారణంగా ఎంత మంది దొంగ ర్యాంకులు సాధించారో తెలియదు. వీరందరూ మంచి కాలేజీల్లో సీట్లు తెచ్చుకుంటే తెలివైన విద్యార్థులకు తీరని అన్యాయమే జరుగుతుంది. మంచిగా చదువుకున్నవారు ఈసారి మరింత మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు.. కాబట్టి తల్లిదండ్రులు పాజిటివ్ గా తీసుకోవడమే మంచిది. విలువైన సమయం, డబ్బు వృధా కావడం బాధాకరమే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయం అనిపిస్తోంది..

ఎంసెట్ 2 దోషులపై చర్యలు తీసుకుంటున్నాం అని తెలంగాణ ప్రభుత్వం చేతులు దులుపుకుంటే సరిపోదు. ఇందుకు బాధ్యత కూడా వహించాలి. సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు, పరీక్ష నిర్వహణ సిబ్బంది అసమర్ధతకు ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుంది? ఎంసెట్ ద్వారా అయినా కావాలి వీరికి మైండ్ సెట్..

No comments:

Post a Comment