Friday, April 29, 2016

హడలెత్తిస్తున్న స్వామి

దేశంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజులు అవి.. ప్రజాస్వామ్యం స్థానంలో నియంతృత్వాన్ని నెలకొల్పారు ఆమె.. ప్రతిపక్ష నాయకులందరినీ జైలులో బంధించారు. జనసంఘ్ కు చెందిన ఒక ఎంపీ మాత్రం అప్పటికే విదేశాలకు వెళ్ళిపోయాడు.. అతను రాగానే అరెస్టు చేయమని ఆదేశించింది ఇందిర..
అదే సమయంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి.. ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా సాగిపోతున్నాయి.. వందిమాగదులు ఆహా ఓహో అని పొగుడుతుంటే పులకించి పోతున్నారు ప్రధాని ఇందిర.. ఇంతలో ఢిల్లీ విమానాశ్రయంలో  ప్లయిట్ నుండి దిగాడో వ్యక్తి.. నేరుగా పార్లమెంట్ వెళ్ళాడు.. హాజరు పట్టీలో సంతకం పెట్టి లోనికి వెళ్ళాడు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న వేశాడు.. అతన్ని చూసి అధికార పక్షంలో కలకళం చెలరేగింది..
ప్రధాని ఇందిరాగాంధీ అవాక్కయ్యారు.. విదేశాల్లో ఉన్న ఈ వ్యక్తి దేశంలోకి ఎప్పుడొచ్చాడు.. అరెస్టు కాకుండా నేరుగా పార్లమెంటుకు వచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం ఏమిటి అంటూ నిఘా వర్గాలపై చిందులు తొక్కారు.. పార్లమెంట్ ముగియగానే అరెస్టు చేయమని ఆదేశించారు.. కానీ పార్లమెంట్ ముగిసి పోలీసులు సర్దుకునేలోపు ఆ ఎంపీ మాయమయ్యాడు.. మళ్లీ విమానం ఎక్కి విదేశాలకు వెళ్ళిపోయాడు. హతాశురాలై పోయింది ఇందిర గాంధీ..
ఆ సదరు ఎంపీయే సుబ్రహ్మణ్య స్వామి.. తర్వాత కాలంలో జనతా పార్టీ అధ్యక్షునిగా, కేంద్రమంత్రిగా పని చేశారు స్వామి.. ఆయన రాజకీయాల్లో అపర చాణక్యుడు మాత్రమే కాదు.. ఆర్థిక, న్యాయ శాస్త్ర కోవిదుడు కూడా.. హార్వార్డ్ యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా సేవలు అందించారు.. అన్యాయం, అవినీతి అంటే గిట్టదు స్వామికి.. ఎంతో మంది అవినీతి పరులైన నాయకులను కోర్టు బోను ఎక్కించాడు..
సుబ్రహ్మణ్య స్వామి మరోసారి పార్లమెంట్ సభ్యునిగా రాజ్యసభలో అడుగు పెట్టారు.. ఆయన రీ ఎంట్రీ అదిరి పోయింది.. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో సోనియాగాంధీకి చెమటలు పట్టిస్తున్న స్వామి, తాజాగా అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ స్కామ్ లో ఆమె పాత్రపై చెడుగుడు ఆడుతున్నారు.. పాపం  పుణ్యమా అని కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా అయింది.. థట్స్ సుబ్రహ్మణ్య స్వామి..
స్వామీజీ సంఘర్ష్ కరో.. దేశ్ తుమారే సాథ్ హై..

No comments:

Post a Comment