Tuesday, February 27, 2018

వాస్తవిక బడ్జెట్ ఇది..



సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముంగిట‌ వ‌చ్చిన కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం అంటూ ఇటు తెలంగాణ‌, అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెద‌వి విరుపులు ముందుగా ఊహించిన‌వే.. మాబోటి వేత‌న జీవుల‌కు కూడా ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితి విష‌యంలో ఆశ‌లు ఉండ‌టం కూడా స‌హ‌జం.. కానీ కేంద్ర బ‌డ్జెట్‌ను పూర్తిస్థాయిలో అధ్య‌య‌నం చేస్తే దేశ ప్ర‌జ‌లంద‌రికీ మేలు చేసేదిగానే క‌నిపిస్తోంది.

ముఖ్యంగా రైత‌న్న‌ల సంక్షేమానికి, వ్య‌వ‌సాయానికి పెద్ద పీట వేయ‌డం సంతోష‌క‌రం.. పంట‌ల‌కు మ‌రింత గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డం చెప్పుకోద‌గ్గ విష‌య‌మే.. అన్నింటిక‌న్నా ముఖ్యంగా 10 కోట్ల పేద ప్ర‌జ‌ల‌కు రూ.5 ల‌క్ష‌ల ఆరోగ్య బీమా చాలా గొప్ప విష‌యం..
కేంద్ర బ‌డ్జెట్‌లో పెద్ద‌గా వ‌రాలు, నిధులు, తాయిలాలు,ఆక‌ర్శ‌న ఏమీ లేక‌పోక‌పోవ‌చ్చు కానీ ఇది ఆచ‌ర‌ణాత్మ‌కంగా క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద హామీలు ఇవ్వ‌డం, ఆ త‌ర్వాత నిధులు లేక‌ నిరాశ ప‌ర‌చ‌డం అవ‌స‌రం లేదు. ఏది సాధ్య‌మో ఆదే చేస్తే చాలు..
బ‌డ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల‌కు ఏమీ రాలేదు అంటే అది ఇక్క‌డి నాయ‌కుల వైఫ్య‌మే.. ఇత‌ర రాష్ట్రాలు త‌మ‌కు కావాల్సిన ప్రాజెక్టుల విష‌యంలో కేంద్రాన్ని ఒప్పించి సాధిస్తున్న‌ప్పుడు మ‌నం ఎందుకు వెన‌క‌బ‌డుతున్నాం అని ఆలోచించాలి. కేంద్ర ప్ర‌భుత్వానికి తెలుగువారు ఏమీ శ‌త్రువులు కాదు.. ఆచ‌ర‌ణ సాధ్యం కానీ అంశాల‌పై వ్య‌ర్థ పోరాటాలు చేసే బ‌దులు, మ‌న‌కు ఏది ప్ర‌ధానంగా అవ‌స‌ర‌మో దాన్ని గుర్తించి, ఒప్పించి సాధించుకోవాలి..

02.02.2018

No comments:

Post a Comment