Friday, November 3, 2017

దేశభక్తికి అర్థం మారిపోతోందా?

దేశమును ద్వేషించుమన్నా
చెడు యన్నది పెంచుమన్నా 
మంచి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి కీడు తలపెట్టవోయి.. 
..ఇకపై మనతో ఇలా పాడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. 
దేశభక్తిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు అంటారు కొందరు అడ్డ గాడిదలు.. వారు మున్ముందు మనకు బోధించే సుభాషితాలు ఇలా ఉండబోతున్నాయి..
' తల్లిదండ్రులను, గురువులను గౌరవించమని చెప్పకండి.. నైతిక విలువలు అనవసరం.. విచ్చల విడిగా జీవించండి.. మందు కొట్టినా, డ్రగ్స్ తీసుకున్నా, వ్యభిచరించినా తప్పులేదు.. తోటివారిని ద్వేషించండి.. '
ఇవాళ దేశభక్తిని, జాతీయ గీతాన్ని వద్దంటున్నవాడు రేపు ఈ దేశమే అక్కరలేదంటాడు..
ఇలాంటి వారి కారణంగానే కదా మన దేశంలో గజానికో గాంధారి పుత్రుడు పుడుతున్నది?.. కొత్త కొత్త వాదాలను సృష్టిస్తూ దేశంలోని ప్రాంతాలు, భాషలు, మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్న గుంట నక్కలను ఓ కంట కనిపెట్టండి.. ప్రజల మనోభావాలు, సనాతన ధర్మ సంస్కృతి సంప్రదాయాల మీద జరుగుతున్న దాడిని అర్థం చేసుకోండి..
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ ద్రోహులు, ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న పార్టీలకు బుద్ది చెప్పకపోతే మన దేశ అస్థిత్వానికే ప్రమాదం.. ప్రతి భారతీయుడు జాగరుకుడై ఉండాల్సిన సమయం ఇది..
వీరందరినీ తన్ని తరిమేద్దాం మన భారతదేశం నుంచి.. (27.10.2017)

No comments:

Post a Comment