Friday, November 3, 2017

హిందువులపై ద్వేషం ఎందుకయ్యా నీకు?

హిందూ తీవ్రవాదం లేదని చెప్పలేం.. ఎక్కడైనా ఓ హిందూ తీవ్రవాదిని చూపించండనే సవాలును ఇకపై వారు (హిందువులు) విసరలేరు.. ఆ స్థాయిలో వారి వర్గంలోనే తీవ్రవాదం వ్యాపించింది.. అంటున్నాడాయన..
తమిళనాట కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్యమంత్రినైపోవాలని పగటి కలలు కంటున్నాడాయన.. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చేశాను.. పార్టీ పెడతాను.. అంటూ హడావుడిగా రోజుకో ప్రకటన చేస్తున్నాడు. ఏదేదో వాగేస్తూ నిత్యం వార్తల్లో నిలిచి పబ్లిసిటీ పొందాలని ప్రయత్నిస్తున్నాడు కమల్ హాసన్.. సత్యమేవ జయతే అన్న నినాదంపై హిందువులు విశ్వాసం కోల్పోయి, హింసా మార్గం ఎంచుకున్నారట.. ఇలా కమల్ తాను హైందవేతరున్ని అన్నట్లుగా వికట హాసం చేశాడు ఆనంద వికటన్లో.. ఓకే.. ఇలాగైనా హిందువును కాను అని ఒప్పుకున్నాడు..  
క‌మ‌ల్ ముందు తానేమీ మాట్లాడుతున్నాడో ఆత్మ విమ‌ర్శ చేసుకుంటే మంచిది.. ఆయ‌న చెబుతున్న‌హిందూ తీవ్రవాదం ఎక్క‌డ ఉంది? ఆ తీవ్రవాద సంస్థ‌లు ఏమిటో చెబితే బాగుంటుంది.. ఆధారాలు ఉంటే చట్టపరంగా పోరాటం చేయొచ్చు.. గాలిలో రాయి విసిరి ఎక్క‌డో త‌గులుతుంది క‌దా అనే ఎత్తుగ‌డ రాజ‌కీయంగా ఆయ‌న‌కే బెడిసికొడుతుంద‌ని అర్థం చేసుకోవాలి..
తీవ్రవాద కలాపాలతో దేశ ద్రోహం చేయడానికి హిందువులు ఏ దేశం నుంచో ఊడి పడలేదు.. ఈ దేశమే వారిది.. యే హిందుస్తాన్ హై.. హిందువోంకా హిందూ దేశ్.. ఈ దేశం అసలు పేరు హిందుస్తాన్.. సారే సహాజే అచ్చా హిందూ సితాహ్ హమారా అని ఎందుకు పాడుతారో తెలుసా? తెలియకుంటే చరిత్ర పుస్తకాలు చదువుకో..
హిందూ తీవ్రవాదాన్ని అరిక‌ట్ట‌డంలో కేర‌ళ ముఖ్య‌మంత్రి స‌మ‌ర్ధ‌వంతంగా ప‌ని చేస్తోంద‌ని కితాబిస్తున్నాడు క‌మ‌ల్ హాస‌న్‌.. అయ్యా.. (ప‌ర‌)లోకనాయ‌కా! కేర‌ళ‌లో జ‌రుగుతున్న వామ‌ప‌క్ష రాజ‌కీయ‌ హింసోన్మాదం నీకు క‌నిపించ‌డం లేదా?.. అక్క‌డి వామ‌ప‌క్ష ప్ర‌భుత్వం వందలాది మంది బీజేపీ, ఆరెస్సెస్ కార్య‌క‌ర్త‌ల‌ను హతమారుస్తున్న వైనంపై దేశ వ్యాప్త చ‌ర్చ నీ దృష్టికి రాలేదా?.. స్వ‌యంగా నీవు కలిసి వచ్చిన పినరయి విజయన్ సైతం హ‌త్యారోప‌ణ‌ ఎదుర్కోవడం నీకు తెలియ‌క‌పోతే తెలుసుకో.. కేర‌ళ ల‌వ్ జిహాదీ ఘ‌ట‌న‌లు నీకు చూడ ముచ్చ‌ట‌గా క‌నిపిస్తున్నాయా?.. త‌మిళ‌నాడులో హిందూ అతివాదం విస్త‌రించింద‌ని బాధ ప‌డుతున్నావుగా క‌మ‌ల్.. ఇలాంటి వాఖ్య‌లు చేస్తున్న నీకు త‌మిళ‌నాడు హిందూ ఓట‌ర్లు వాత పెట్ట‌డం ఖాయం..

క‌మ‌ల్ హాస‌న్ మాన‌సిక స్థితి బాగా లేద‌ని  అంటున్నారు కొంద‌రు నాయ‌కులు.. నేను ఈ వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌వించ‌డం లేదు.. ఎందుకంటే క‌మ‌ల్ (అతి) తెలివైన వాడిన‌ని క‌ల‌లు కంటూ ఏదేదో మాట్లాడేస్తున్నాడు.. ఎంతైనా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాడు క‌దా?.. ఈయ‌నా ఒక సూడో సెక్యుల‌ర్ - పెక్యుల‌ర్ నాయ‌కుడు అని ముందుగానే తేలిపోయింది. దిగితే కానీ లోతు తెలియదు.. దిగాడుగా రాజకీయాల్లోకి.. ఇక‌ మూల్యం చెల్లించుకోడానికి ఆయ‌న సిద్దంగా ఉండాలి..  

No comments:

Post a Comment