Wednesday, November 8, 2017

నల్లధనంపై చారిత్రక పోరాటం

ప్రమాదానికి గురైన ఒక వ్యక్తి పట్టించుకునే దిక్కులేక అవిటివాడై చేతి కర్రలతో కుంటుతున్నాడు.. ఒక డాక్టర్ అతని అవస్థను గుర్తించి శస్త్ర చికిత్స చేశాడు.. ఆ వ్యక్తి కోలుకుని నడవాలంటే కొన్ని వారాలు, నెలలు పడుతుంది.. ఇదే పరిస్థితి దేశ ఆర్థిక రంగానికి వస్తే..
నల్లధనంపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ₹.500, 1000 నోట్లను రద్దు (Demonetisation) చేసి ఏడాది అవుతోంది.. దేశ ఆర్థిక చరిత్రలో ఇది సాహసోపేతమైన నిర్ణయం.. దశాబ్దాలుగా పేరుకు పోయిన నల్లధనం ఒక్కసారిగా మాయం అవుతుంది అని ఎవరూ భావించలేరు. కానీ ఈ దిశగా ఒక అడుగు పడింది..
పురాతనకాలంలో మంచి పని చేపట్టినప్పుడు రాక్షసులు అడుగడుగునా అడ్డుపడేవారు.. ఇప్పుడు మోదీజీ చేపట్టిన యజ్ఞానికి కూడా ఇదే పరిస్థితి.. ప్రశంసించడం ఇష్టం లేకుంటే గమ్మున ఉండి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూసి స్పందించాలి.. కానీ ఆరంభం నుంచే తుమ్మలు మొదలయ్యాయి. ఈ వ్యక్తులు, శక్తుల దుష్ప్రచారం కారణంగా ప్రజల్లో ఆందోళన మొదలైంది. అవసరం లేకున్నా ఏటీఎంల ముందు గంటలు, రోజుల తరబడి క్యూలు కట్టించారు.. ఫలితంగా బ్యాంకుల్లో కరెన్సీ చెలామనికి ఇబ్బందులు కలిపించారు..
నిజానికి పెద్దనోట్ల రద్దువల్ల సామాన్యుని పెద్దగా ఇబ్బంది వచ్చింది ఏమీ లేదు.. పెద్ద ఎత్తున నగదు నిల్వలు ఉన్నవారే కష్టాలకు గురయ్యారు.. అది సహజం..
ఒక సాహసోపేతమైన భారీ కార్యక్రమం చేపట్టినప్పుడు ఫలితాలు అంత తొందరగా కనిపిస్తాయని ఆశించడం మూర్ఖత్వం.. ఉదాహరణకు మనం ఏదైనా వ్యాపారం మొదలు పెట్టగానే తక్షణ లాభాలు వచ్చేస్తాయా?.. ప్రమాదానికి గురైన రోగి చికిత్స జరిగిన వెంటనే లేచి పరుగెడతాడా?.. కొన్ని వారాలు, నెలలు కూడా పట్టవచ్చు.. మరి దశాబ్దాలుగా రోగగ్రస్థమైన దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగే చికిత్సకు ఇంత తక్కువ వ్యవధిలో జడ్జిమెంట్ అవసరమా?..
ఒక చారిత్రాత్మక నిర్ణయానికి దేశ ప్రజలమంతా అండగా ఉందాం.. నల్లధనంపై పోరులో మనవంతు పాత్రను విజయవంతం చేద్దాం.. జై స్వచ్ఛ్ భారత్..

No comments:

Post a Comment