Friday, December 15, 2017

అమరనాథ్ యాత్రపై మతిలేని ఆంక్షలు

సనాతన హిందూ ధర్మానికి ప్రకృతికి విడదీయరాని సంబంధం ఉంది. పంచభూతాలైన అగ్ని, భూమి, నీరు, వాయువు, ఆకాశాలను దేవతలుగా పూజిస్తాం.. మన వేద వాఙ్మయంలో వీటి ప్రస్థావన ఉంది. కానీ హైందవం ప్రకృతికి విఘాతం అనే రీతిలో కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. వినాయక చవితి, దీపావళి వేడుకల సందర్భంగా ఈ వర్గాలకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అడ్డగోలుగా మాట్లాడేస్తూ మెజారిటీ ప్రజల మనోభావాలను కించపరచడం పరిపాటిగా మారింది. బాధ్యతాయుతమైన సంస్థలు కూడా గుడ్డిగా ఇలాంటి వారి వాదలకు వత్తాసు పలిచే ఆంక్షలు విధించడం, ప్రకటనలు చేయడం దారుణం..
అమరనాథ్ యాత్ర కారణంగా హిమాలయాల్లో పర్యావరణానికి ముప్పు వాటిల్లిందని ఎవరో పనికిమాలిన వారు వేసిన పిటిషన్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అతిగా స్పందించింది.. యాత్రీకులకు విధించిన ఆంక్షలు పూర్తిగా హాస్యాస్పదంగా ఉన్నాయి..
' అమరనాథ్ గుహలో గంట కొట్టరాదు.. మంత్రాలు చదవరాదు.. కొబ్బరికాయ కొట్టరాదు..' ఇలాంటి ఆంక్షలను చూస్తుంటే అమరనాథ్ యాత్రపై ఎందుకు ఇంత కక్ష అనిపించడం లేదా?
ఏటా లక్షలాది మంది యాత్రీకులు హిమాలయ గుహలో మంచు లింగం రూపంలో వెలిసిన భోళా శంకరున్ని దర్శించుకుంటారు.. ఈ భక్తుల మనోభావాలను దెబ్బతీసే హక్కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఎవరు ఇచ్చారు?..
మధ్యయుగంలో హిందువుల తీర్థయాత్రలపై జిజియా పన్ను విధించేవారు.. ఇంకా నయం ఇలాంటి పన్నును అమరనాథ్ యాత్రీకులపై విధించాలని సిఫార్స్ చేయలేదు..
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధిస్తున్న తలతిక్క తుగ్లక్ ఆంక్షలను ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలి..

No comments:

Post a Comment