Tuesday, December 5, 2017

కాంగ్రెస్ ముక్త్ దిశగా మరో అడుగు

'కాగల కార్యం గంధర్వులే తీర్చారు’.. అన్నట్లు 'కాంగ్రెస్'కాంగ్రెస్ ముక్త్  ముక్త్ భారత్ అభియాన్’కు ఆ పార్టీ నాయకులు సైతం సమిధలు అందించారు. రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికోవడం ద్వారా.. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందిట.. రాహుల్ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష హోదాల్లో సాధించిన విజయాలు ఏవీ లేవు.. ఆయన ప్రచార బాధ్యతలు చేపట్టిన చోటల్లా ఓటమే కనిపిస్తోంది.. ఒకటి అరా స్థానిక కారణాల వల్ల సాధించిన గెలుపును యువరాజా ఖాతాలోకి నెట్టే ఆ పార్టీ క్యాడర్, వైఫల్యాలకు మాత్రం ఏనాడూ ఆయన్ని బాధ్యున్ని చేయలేదు..
కాంగ్రెస్ పార్టీలో హేమా హేమీ నాయకులు ఉన్నారు.. కానీ వారికి సోకాల్డ్ ‘గాంధీ – నెహ్రూ’ఫ్యామిలీయే ముద్దు. జవహర్ లాల్ నెహ్రూ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ వంశ పారంపర్యం అయిపోయింది. పార్టీలో అగ్ర నేతలను కాదని తన కూతురు ఇందిరా గాంధీని ప్రోత్సహించాడా మహానుభావుడు. సీనియర్లకు పొగబెట్టే కార్యక్రమాన్ని ఇందిర విజయవంతంగా పూర్తి చేసింది. వారసునిగా సంజయ్ గాంధీని నిశ్చయించినా, ఆయన విమాన ప్రమాదంలో మరణించాడు. దీంతో అనివార్యంగా రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చాడు. ఇందిర హత్యానంతరం ప్రధానమంత్రి పదవితో పాటు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
రాజీవ్ హత్య తర్వాత విషాదంలో మునిగిపోయిన సోనియా గాంధీని కోటరీ నాయకులు కదిలించే సాహసం చేయలేక మెతక మనిషి కదా అని పీవీ నరసింహారావును అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.. ఆ తర్వాత ఆయనే ప్రధాన మంత్రిగా అయ్యారు. శాంత స్వభావుడు అనుకున్న పీవీ కాస్తా ఏకు మేకై అసలు సిసలు నారసింహుని అవతారం చూపడంతో కోటరీ పప్పులు ఉడకలేదు.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమికి బాధ్యున్ని చేసి పీవీని అన్యాయంగా తప్పించారు. సీతారాం కేసరి అనే విధేయున్ని మధ్యేమార్గంగా తోలుబొమ్మ అధ్యక్షునిగా పెట్టుకొని, చివరకు సోనియా గాంధీ చేతికి పగ్గాలు అప్పగించారు.  
తర్వాత కథ అందరికీ తెలిసిందే.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాకు ఎన్నికల్లో తన పార్టీ గలిచినా విదేశీయత కారణంగా ప్రధాని పదవి దక్కలేదు. దీనికి‘త్యాగం’ అనే పేరు పేట్టేశారు.. గత్యంతరం లేక మంచివాడైన మెతక మనిషి మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేసి రిమోట్ కంట్రోల్ పాలన నడిపింది సోనియా గాంధీ.. పాపం ఆ పెద్దాయన తనకు తెలియకుండానే అవినీతి మరకల పాలన అందించారు. 
అనారోగ్యంతో బాధ పడుతున్న సోనియా గాంధీ తన తనయుడు రాహుల్ గాంధీని ఎనాడో పార్టీ అధ్యక్షున్ని చేయాలనుకున్నా, ఆయన చిపల చిత్తం కారణంగా ఆ సాహసం చేయలేక పోయింది. నాయకత్వ బాధ్యతలపై నేర్పు వచ్చేందుకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, అంతగా ఆయన ఉపయోగించుకోలేక పోయారు. కూతురు ప్రియాంకకు బాధ్యతలు ఇద్దామంటే ఇప్పటికే ఆమె పతి దేవుడు స్కాముల్లో మునిగిపోయాడు. చివరకు రాహుల్ కు పగ్గాలు అప్పగించక తప్పలేదు..
రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినందుకు అందరికన్నా హ్యాపీగా ఉన్నది కమలనాథులే..

No comments:

Post a Comment