Wednesday, December 16, 2015

కేజ్రీ చట్టపట్టాల్ ఎవరితో?

మొన్న పాట్నాలో పశుగ్రామ కుంభకోణ నిందితుడు లాలూ ప్రసాద్ యాదవ్ ను కౌగలించుకున్నాడు.. ఇవాళ ఏకంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ముఖ్యకార్యదర్శి రాజేంద్ర కుమార్ పై సీబీఐ దాడులను తప్పు పట్టాడు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎందుకిలా మారిపోయాడు.. లోక్ పాల్ బిల్లు కోసం జరిగిన అన్నా హజారే పోరాటాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకొని సీఎం పదవిని సంపాదించాడు కేజ్రీవాల్.. తన హద్దులను ఢిల్లీకే పరిమితం చేసుకొని ఉద్యమాన్ని గాలికొదిలేశాడు.. ఇప్పుడు ఏకంగా అవినీతి పరులైన అధికారులకు అండగా నిలుస్తున్నాడు..
తనకు ముందుగా చెప్పి దాడులు చేయలేదని తప్పు పడుతున్నాడు కేజ్రీవాల్.. సర్జీ మేము దాడులకు వస్తున్నాం, అంతా సర్దుకొని సిద్దంగా ఉండండి అని సీబీఐ ముందుగానే సమాచారం ఇవ్వాలా?.. కేజ్రీవాల్ తో బంధం తెంచుకోవడం మంచిదైందని ఇటీవల అన్నా హజారే వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి..

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై తన రాజకీయ వ్యతిరేకతను చాటుకోవడానికి కేజ్రీవాల్ కు అనేక మార్గాలు ఉన్నాయి.. కానీ అవినీతి విషయంలో ఇలా ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం ఆయన విశ్వసనీయను ప్రశ్నార్ధకం చేస్తోంది..

No comments:

Post a Comment