Saturday, December 26, 2015

ప్ర‌ధాని మోదీ ఆక‌స్మిక పాక్‌ ప‌ర్య‌ట‌న దౌత్య విజ‌యమే..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్లో జరిపిన ఆకస్మిక పర్యటన దౌత్య పరంగా పొరుగు దేశంపై మన విజయంగా భావించాలి.. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే పొరుగు దేశాల అధినేతలతో పాటు పాకిస్తాన్ను కూడా ఆహ్వానించి తన విధానాన్ని స్పష్టం చాటుకున్నారు.. పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఆ దేశంలో పర్యటనను వాయిదా వేసుకున్నారు మోదీ..  ఇప్పుడు పరిస్థితులు కాస్త కుదుట పడగానే పాకిస్తాన్లో హఠాత్తుగా పర్యటించడం వ్యూహాత్మకమే అని భావించాలి.. ఇందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో శుభకార్యాన్ని ఉపయోగించుకున్నారు.. అయితే అంతకు కొద్ది గంటల ముందే ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన కార్యక్రమంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడాన్ని మోదీ స్పషంగా ఎండగట్టారు.. ఆది ఆయన దౌత్య చతురతకు అద్దం పడుతోంది.. 
ఏడాదిన్నర క్రితం ఇరుగు పొరుగుతో పాటు ప్రపంచ దేశాలతో మన దేశ ద్వైపాక్షిక సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి.. ఈ నేపథ్యంలో మోదీ మన విదేశాంగ విధానాన్ని తిరగరాస్తున్నారు.. ఈ రోజున అగ్ర దేశాలతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు భారత్ విషయంలో సానుకూల దృక్పథం పెంచుకోవడం దేశ ప్రజలందరికీ గర్వకారణకమైన విషయం.. ప్రధాని దేశంలోకన్నా విదేశాల్లోనే ఎక్కువగా పర్యటిస్తున్నారని నోరు పారేసుకుంటున్నవారు ఈ విషయాన్ని గుర్తించాలి.. 
తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1953,1960 సంవత్సరాల్లో పాకిస్తాన్లో పర్యటించారు.. రాజీవ్ గాంధీ 1988,1989 సంవత్సరాల్లో ఆ దేశానికి వెళ్లారు.. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి 1999, 2004 సంవత్సరాల్లో పాక్ పర్యటనకు వెళ్లారు.. మధ్యలో ప్రధాని మన్మోహన్ సింగ్కు తీరిక దొరకలేదు.. ఈయన హయాంలో మన భారత దౌత్య విధానం పూర్తిగా దెబ్బతిన్నది..  మళ్లీ ఇన్నాళ్లకు ప్రధాని మోదీ పాకిస్తాన్కు వెళ్లారు..
భారత దేశ విదేశాంగ విధానంలో సరికొత్త అధ్యాయానికి మోదీ నాంది పలికారు..

No comments:

Post a Comment