Saturday, December 12, 2015

1857 నాటి కుట్రలు కొనసాగుతున్నాయి..

భారత స్వాతంత్ర్య సమర పోరాటానికి క్రీ.శ.1857సం.లో అంకురార్పణ జరిగింది.. బ్రిటిష్ వారు దీన్ని సిపాయిల తిరుగుబాటు (Sepoy Mutiny) అన్నారు.. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్  సావర్కర్ 1857లో జరిగింది ప్రథమ స్వాతంత్ర్య సమరం (First war of Independence) అని ఆధార సహితంగా చాటి చెప్పారు.. ప్రథమ స్వాతంత్ర్య సమరంలో సిపాయిల తిరుగుబాటు ఒక భాగం.. ఇంతకీ సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగిందో తెలుసా?
ఈస్టిండియా కంపెనీ సైన్యంలోని సిపాయిలకు ఎన్ ఫీల్డ్ అనే కొత్త తుపాకులు సరఫరా చేశారు.. సిపాయిలు ఈ తుపాకుల్లో లోడ్ చేసే తూటాల సీల్ ను పంటితో తొలగించాలి.. అయితే ఈ తూటాల సీలును ఆవు, పంది మాంసం నుండి తీసిన కొవ్వుతో తయారు చేయడం బయట పడింది.. కంపెనీ సైన్యంలో అత్యధికులు హిందువులు, ముస్లింలు.. బ్రిటిష్ వారు తమ మత విశ్వాసాలను అవహేళన చేయడాన్నివారు తట్టుకోలేకపోయారు.. మంగళ్ పాండే నేతృత్వంలో సైన్యంలో తిరుగుబాటు వచ్చింది..
ఒకటిన్నర శతాబ్దం క్రితం జరిగిన ఈ ఘటన బ్రిటిష్ వారి విభజించి పాలించు అనే కుటిల నీతిలో భాగం.. దేశ ప్రజలంతా ఏకమై దాన్నితిప్పికొట్టి ఐక్యతను చాటుకున్నారు.. ఆ తర్వాత జరిగిన జాతీయ ఉద్యమానికి ఈ ఐక్యత దారి చూపింది.. బ్రిటిష్ వాడు పోతూ పోతూ మన దేశాన్ని విభజించడంతో పాటు సమాజంలో చిచ్చు పెట్టి పోయాడు.. విదేశీ భావదాస్యతను జీర్ణించుకున్న కొన్ని శక్తులు ఈ నాటికి మన దేశాన్ని, సమాజాన్ని విచ్ఛినం చేసే దిశగా కుట్రలు పన్నుతూనే ఉన్నాయి..

ఇప్పుడు కొన్ని సంస్థలు నిర్వహిస్తున్న కూరల పండుగలను మనం ఏ దృష్టితో చూడాలి? తాము కోరుకుంటున్న ఆహారం తినే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. కానీ ఆహార స్వేచ్ఛ అంటూ వీధినపడి, మత పరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టడం ఎంత వరకూ న్యాయం? ప్రజల మత విశ్వాసాలతో ఆడుకొని వారిలో ఒకరిపట్ల మరొకరికి అపనమ్మకం, విధ్వేషాలను సృష్టించడం ఏ రకమైన స్వేచ్ఛకు ప్రతీక?.. ఆలోచించండి..

No comments:

Post a Comment