పాము చిన్నదైనా, పెద్దదైనా విష పూరితమే.. నేరాలకు
వయసుతో ముడిపెట్టే ముందు వారి స్వభావాన్ని కూడా గమనించాలి.. దేశ ప్రజలందరినీ కదిలించిన
నిర్భయ అత్యాచార కేసులో ఓ నేరగాడు మైనర్ అనే కారణంతో విడుదల చేయడంలోని ఔచిత్యం
ఏమిటో న్యాయస్థానాలే చెప్పాలి.. ఈ కేసులోని ఈ వ్యక్తి పేరుకే బాలుడు. కానీ బాధితురాలి
పట్ల ఇతర నిందితులందరికన్నా అత్యంత ప్రవర్తించాడని విచారణ సందర్భంగా
తేలిందటున్నారు.. ఇతర నేరగాళ్లకు కఠిన శిక్షలు పడ్డా, మైనర్ అనే కారణంతో
ఇతన్నిప్రత్యేక పరివర్తన సదనంలో ఉంచారు.. కానీ ఈ సమయంలో అతనిలో ఎలాంటి పశ్చాతాపం
కనిపించలేదని, పైగా మరింత తీవ్ర భావాలను ప్రదర్శించాడని న్యాయవాదులు చెబుతున్నారు..
నేరగాడి ప్రవర్తనను పరిగణనలోని తీసుకోకుండా విడుదల చేయాలని న్యాయస్థానం
నిర్ణయించడం దేశ ప్రజలెవరూ జీర్ణించుకోలేక పోతున్నారు.. మన న్యాయ వ్యవస్థలోని
లొసుగులను ఈ కేసు మరోసారి నిరూపించింది..
No comments:
Post a Comment