Friday, December 4, 2015

చెన్నై గుణ పాఠం..

చెన్నపట్నం చిన్నబోయింది.. చెరువైపోయింది. భారీ వర్షాలకు నీట మునికి అతలాకుతలమైంది.. భారత దేశంలోని మెట్రోనగరాల్లో దక్షిణాదికే తలమానికంగా నిలచిన ఈ నగరానికి ఎందుకీ దుస్థితి? మానవ తప్పిదాల కారణంగానే ప్రకృతి కన్నెర్రజేసిందా?
ఒక్కప్పుడు చెన్నై నగరంలో పెద్ద సంఖ్యలో చెరువులు ఉండేవి.. మూడు ప్రధాన నదులు ఉన్నాయి.. వర్షం నీరు కాలువల ద్వారా చెరువుల్లో చేసి అక్కడి నుండి నదుల్లో చేరేది.. ఆ తర్వాత ఈ నీరంతా సముద్రంలో కలిసేది.. శివారు ప్రాంతంలో విచ్చల విడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోయి పొలాలు కనుమరుగయ్యాయి.. ఆ తర్వాత చెరువులను కబ్జా చేశారు.. చెన్నై శరవేగంగా అభివృద్ధి చెందుతూ కాంక్రీట్ జంగల్ అయిపోయింది..
చెన్నైలో గత వందేళ్లుగా ఇంతటి భారీ వర్షం కురవలేదు.. ఒక్కసారిగా పెద్ద వానలు పడే సరికి వాననీరు నగరాన్ని ముంచెత్తింది.. చెరువులు, కాల్వలు కనుమరుగవడంతో వరద నీరంతా వీధుల్లోకి వచ్చింది. వేల సంఖ్యలో ఇళ్లూ, భవనాలు మునిగాయి.. ప్రణాళికాబద్దంగా లేని నగరాభివృద్ధి కారణంగా డ్రైనేజీలు వరద నీటిని తట్టుకోలేకపోయాయి.. దీనికి తోడు విచ్ఛల విడిగా ప్లాస్టిక్ వాడకం కారణంగా చెత్తా చెదారం డ్రైనేజీల్లో ప్రవాహానికి అడ్డు పడింది.. ఉన్న కొద్ది పాటి కాలువల్లో భవన నిర్మాణ వ్యర్ధాలను పడేస్తున్నారు.. ఇక వరద నీరు ఎక్కడికి పోవాలి.. దీని ఫలితమే ఈ జల విలయం..

ప్రకృతి చెన్నైకి నేర్పిన గుణపాఠం ఇతర నగరాలకు కనువిప్పు కావాలి.. ప్రకృతికి వ్యతిరేకంగా పోతే వినాశనమే అని ఇకనైనా మనమంతా అర్థం చేసుకోవాలి..

No comments:

Post a Comment