జంతు ప్రేమికులమంటూ ఆర్భాటాలు చేసే వారు ద్వంద్వ
వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారు?.. కొన్ని మతాల వారి సాంప్రదాయాలపై మాత్రమే వారు
ఎందుకు గురి పెడుతున్నారు? తమిళనాడులో పొంగల్ పర్వదినం సందర్భంగా నిర్వహించే జల్లి
కట్టు వేడుకలను పని గట్టుకొని నిషేధింపజేశారు.. కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని
ఎత్తేస్తే ఈ సోకాల్డ్ జంతు ప్రేమికులు సుప్రీం కోర్టు గడప ఎక్కి స్టే తెచ్చారు.. ఈ
అత్యుత్సాహపరులకు విచ్చలవిడిగా సాగుతున్న గోహత్య, ఇతర జంతువుల వధ కనిపించదా.. దేశ
వ్యాప్తంగా గోవధను నిషేధించే విషయంలో వీరు ఎందుకు దృష్టి పెట్టడం లేదు.. ఇంతకీ ఈ
సోకాల్డ్ గాళ్లు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు?
No comments:
Post a Comment