చిన్నప్పుడు ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న
శ్రీ సరస్వతి విద్యా మందిరం (కందికల్ గేట్, హైదరాబాద్)లో జరిగిన గణతంత్ర వేడుకల్లో
పాల్గొనే అదృష్టం కలిగింది.. ఈ సందర్భంగా నేను, నా తమ్ముడు శాంతి దేవ్ మిత్ర, మరో
సోదరుడు విక్రమ్ రెడ్డి, బావమరిది విశ్వనాథ్ రెడ్డి మా పాఠశాలలో ప్రారంభమైన
డిజిటల్ తరగతులకు ఉడతా భక్తిగా మా వంతు సాయం అందించాం.. ఇందుకు అవసరమైన పరికరాలను
ప్రధానం చేశాం.. మేమంతా ఇక్కడి పూర్వ విద్యార్థులమే.. ఈ సందర్భంగా జరిగిన సత్కారం
ఆనందంతో పాటు కాస్త ఇబ్బందిగానే అనిపించింది.. విద్యా బుద్దులు చేర్చిన పాఠశాల
రుణం కొంత మేర తీర్చుకున్నాననే తృప్తి కలిగింది.. చేయాల్సింది ఇంకా ఉంది..
భవిష్యత్తులో మరింత సాయం అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను..
No comments:
Post a Comment