
చైనా
చేతిలో మన దేశం ఓడిపోయిన తర్వాత కొద్ది నెలలకే తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ
మరణించారు.. తాత్కాలిక ప్రధాని గుల్జారీలాల్ నందా తర్వాత పూర్తి సమయ ప్రధానిగా
బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి.. ఇంతలో పాకిస్తాన్ తో యుద్దం
వచ్చింది.. మన సైన్యం ఆ దేశాన్ని చిత్తుగా ఓడించింది..
నెహ్రూ
పారిశ్రామికీకరణ పేరుతో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడంతో దేశంలో ఆహారధాన్యాలకు
తీవ్ర కరువు వచ్చి పడింది.. ఈ దశలో హరిత విప్లవానికి నాంది పలికారు శాస్త్రీజీ.. ఈ
సమయంలోనే పుట్టకు వచ్చింది ‘జై జవాన్.. జై కిసాన్..’ నినాదం. ఆసేతు హిమాచలం ఈ నినాదం మార్మోగింది..
దురదృష్టవశాత్తు
హరిత విప్లవ ఫలితాలు చూడక ముందే శాస్త్రీజీ మనకు దూరమయ్యారు.. తాష్కెంట్ లో భారత్,
పాకిస్తాన్ల మధ్య చర్చల అనంతరం అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు లాల్
బహద్దూర్ శాస్త్రి..
నీతి,
నిజాయితీ, నిరాడంబరతకు ప్రతి రూపమైన శాస్త్రీజీ వర్ధంతి నేడు..(11 జనవరి 1966)
ఆ మహనీయున్ని తలచుకోవడం మన విధి..
No comments:
Post a Comment