బీజేపీ
ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చిన్నప్పుడు చాయ్ అమ్మారు.. ఈ విషయాన్ని
దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు చాయ్ వాలా అని ఈసడించినప్పుడు, చాయ్ అమ్మేవాడు ప్రధాని కావద్దా
అని మోడీతో సహా బీజేపీ నేతలు వాగ్భాణాలు సంధించారు.. మోడీ చాయ్ పేరుతో దేశంలోని
పలు చోట్ల టీ కొట్లు తెరవడంతో పాటు ముంబయ్ నరేంద్ర మోడీ సభకు చాయ్ వాలాలను
ప్రత్యేకంగా ఆహ్వానించారు.. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడి చాయ్ అమ్మేవారు
ప్రధాని కావడంలో తప్పు లేదని సన్నాయి నొక్కులు నొక్కింది.. హైదరాబాద్ లో ఇప్పడు
ఒక టీ పొడి హల్ చల్ చేస్తోంది.. దాని పేరు 'మోడీ టీ'.. నేను టీ పొడి కోందామని వెళ్లితే
కనిపించింది. ఇదేదో విచిత్రంగా ఉందని కొన్నాను.. ఈ టీ పొడికి మోడీ పేరు ఎందుకు
పెట్టారని షాపువారిని అడిగాను.. తమకూ తెలియదన్నారు.. దీని లోగుట్టు తెలియకున్నా టీ
రుచి మాత్రం అదిరిపోయింది..
No comments:
Post a Comment