ఇటీవల కొందరు కాంగ్రెస్ నాయకులు
విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.. సోనియా గాంధీకి గుడి కట్టేస్తున్నారు.. ఆ మహా
తల్లి వారికి దేవత అయితే తమ ఇంట్లోనే పూజించుకుంటే మంచిది.. ప్రజల నెత్తిన రుద్దడం
ఎందుకు? ఇదీ ఒకరకమైన అన్యమత
ప్రచారం లాంటిదే.. సోనియాజీ ఏం ఘన కార్యం చేశారని జనమంతా దేవతగా కొలవాలి.. మీకంటే
పదవులు ఇచ్చి, తరతరాల ఆస్తులు సంపాదించుకునే అవకాశం ఇచ్చి ఉండొచ్చు కాబట్టే
దేవతలా కనిపిస్తోంది.. దేశ వ్యాప్తంగా ఆమెపై వ్యతిరేకత పెరుగుతోంది.. ఇప్పటి తరమే
ఆమెను నమ్మనప్పుడు భవిష్యత్ తరాలు ఆమెను ఎలా పూజిస్తారు?.. రేపొద్దున ఎవరైనా
ఇలాంటి గుడుల విషయంలో అపచారాలకు పాల్పడితే ఎవరిది బాధ్యత? ఇలాంటి అర్థం లేని
సెంటిమెంట్లతో జనాల చెవిలో పూలు పెట్టొద్దని మనవి.
No comments:
Post a Comment