అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ
టికెట్ ఆశిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యాలు భారతీయులను ఆందోళనకు గురి
చేస్తున్నాయి.. ఆ దేశ అభివృద్ధిలో భారతీయుల పాత్ర విస్మరించలేనిది.. ఎన్నో
రంగాల్లో మనవాళ్లు కీలక శక్తిగా మారడం ట్రంప్ లాంటి వారికి మింగుడు పడటం లేదు..
ఈయన వైఖరికి రిపబ్లికన్ పార్టీ అభిమానులు కూడా గందరగోళంలో పడ్డారు.. ఆ పార్టీలో
ట్రంప్ అనుకూల-వ్యతిరేకవర్గాలు కారాలు మిరియాలు నూరుకుంటున్నాయి.. జాతి వ్యతిరేక
వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ అధ్యక్షుడైతే దేశ భవిష్యత్తు ఏమిటి అని మెజారిటీ
అమెరికన్లలో ఆందోళన మొదలైంది.. ముస్లింలతో పాటు హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్
ప్రకటనపై భారతీయులు ఆగ్రహంతో ఉన్నారు.. తాజాగా షికాగోలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ
దగ్గర ట్రంప్ తలపెట్టిన బహిరంగ సభలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.. ట్రంప్
వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న వారిపై ఆయన అభిమానులు చేయి చేసుకున్నారు.. కొందరు
భారతీయ జర్నలిస్టులపై దాడి జరిగింది.. అసహనం చిచ్చు రగులుకున్న అమెరికాను ఆ దేవుడే
రక్షించుగాక..
No comments:
Post a Comment