కొన్ని వికృత ఆలోచనలు ఎలా ఉన్నాయో
గమనించండి.. హోలీ జరుపుకోకండి.. రంగులతో కళ్లు చెడిపోతాయి.. వినాయక నిమజ్జనం
కారణంగా చెరువులు కాలుష్యం అవుతాయి.. దీపావళి టపాసులతో వాతావరణం
కాలుష్యమవుతుంది.. అసలు పండుగలే
జరపుకోకుండా ఉంటే.. అంతా బాగుంటుంది కదూ?

ఏ విషయాన్నయినా చెప్పడానికి ఓ పద్దతి
ఉంటుంది.. హోలీ రంగుల విషయంలో జాగ్రత్తలు సూచించవచ్చు.. రసాయన రంగులతో కళ్లకు
కలిగే అనర్ధాలను వివరించవచ్చు.. సహజ సిద్దరంగులనే వాడండి అని చెప్పాలి.. కానీ అసలే
రంగులే చల్లుకోవద్దంటే ఎలా? అలాగే మట్టితో చేసిన గణపతి విగ్రహాలను
ప్రోత్సహించాలి.. కానీ సామూహిక ఊరేగింపులు వద్దు, చెరువుల్లో వేయకుండా మీ ఇంట్లో
బకెట్లోనే నిమజ్జనం చేసుకోండి.. అంటే అర్థం ఏమిటి? అసలు ఉత్సవాలపైనే ఏదో కుట్ర జరుగుతోందని
సంకేతాలు ఇచ్చినట్లా కాదా?.. కాలుష్యానికి కేవలం విగ్రహాలే కారణమనే గురవిందలు
ఎక్కువయ్యారు.. వారి కళ్ల ముందు ఎన్నిరకాల కాలుష్యాలు కనిపిస్తున్నా పట్టవు..
ఇక దీపావళి విషయానికి వద్దాం.. ఉత్తరాంధ్ర
తుఫాను విషాదం కారణంగా టపాకాయలు కాల్చవద్దు అంటే అర్థం చేసుకోవచ్చు.. కానీ కొందరు వ్యక్తులు
అసలు దీపావళి పండుగే వద్దు అంటూ ప్రచారం చేస్తున్నారు.. దీపావళి అంటేనే వెలుగులు
నింపే పండుగ.. మన జీవితాలు కూడా వెలగాలి అనే శుభ సందేశాన్ని ఇస్తుంది ఈ పండుగ..
ధ్వని, వాయు కాలుష్యాన్ని సృష్టించే టపాసుల నియంత్రణపై ఎవరికీ పెద్దగా అభ్యంతరం
లేదు.. కనీ పండుగే జరపుకోవ్వద్దంటే ఎలా? పండుగ నాడు ప్రతి ఇంటా దీపాలు వెలగాలి.. ఈ
సందేశాన్ని ఎందుకు తొక్కిపెడుతున్నారు..
దురదృష్టవశాత్తు పండుగల విషయంలో
నోరుపారేసుకునే వారంతా మెజారిటీ ప్రజల మనోభావాల విషయంలోనే స్పందిస్తున్నారు..
కేవలం ఒక మతం వారే పండుగలకు దూరంగా ఉండాలా? మరి అన్య మతాల పండుగల విషయంలో ఎందుకు
వ్యాఖ్యానాలు చేయరు? ఆలోచించండి..
No comments:
Post a Comment