అరవింద్
కేజ్రీవాల్ కొత్తగా తన పార్టీలో చేరిన ఇద్దరు సభ్యుల పేర్లు చూసి ఆందోళనకు గురై
ఉండాలి..
ఆ ఇద్దరు
సభ్యుల నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ..
వీరిద్దరికీ
ఆమ్ ఆద్మీ పార్టీలో మెంబర్ షిప్ ఇస్తూ రసీదు కూడా జారీ చేశారు.. నరేంద్ర మోడీ
(9001808371), రాహుల్ గాంధీ (9001808330).. అంతే కాదు.. బరాక్ ఓబామా, మహాత్మా
గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్ పేయ్ కూడా ఆప్ సభ్యత్వం తీసుకున్నారట..
దేశ
వ్యాప్తంగా కోటి మంది సభ్యులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆప్, ఇప్పటి
వరకూ 98 లక్షల మందిని చేర్చుకుందని.. సభ్యత్వ నమోదు ప్రారంభించిన 12 రోజుల్లో రిపబ్లిక్
డే నాటికే 50 లక్షల మంది సభ్యులు చేరారని చెబుతోంది.. దేశ వ్యాప్తంగా తమ పార్టీకి
లభిస్తున్న ఆదరణకు మురిసిపోతున్నారు ఆప్ నేతలు..
ఆన్ లైన్ల
సభ్యత్వాలు ఇచ్చేస్తూ, కంప్యూటర్ జనరేటెడ్ రసీదులు ఇచ్చేస్తోంది. ఆ తర్వాత సభ్యత్వ
కార్డులు ఇస్తారట.. దీని ఆసరాగా తీసుకొని కొందరు ఆకతాయిలు ఇలా ప్రముఖుల పేర్లపై
సభ్యత్వాలు నమోదు చేశారే అనుకుందాం.. నిర్ధారించుంకోవాల్సిన అవసరం లేదా?.. ఎవరైనా
సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు, విద్రోహులు సైతం సభ్యత్వం తీసుకుంటే బాధ్యత
ఎవరు వహించాలి..
ఢిల్లీలో
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేకున్నా, ఎస్ఎంఎస్ ల ద్వారా ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేయాలని ప్రజలు కోరినట్లు ఆప్ ప్రకటించుకోవడం తెలిసిందే.. సహజంగా ఆ పార్టీ
సానుభూతిపరులే ఎస్ఎంఎస్ లు పంపుతారనేది అందరికీ తెలిసిన రహస్యమే.. కొన్నేళ్ల
క్రితం ఓ పార్టీ వారు సిమ్ కార్డులు విక్రయిస్తున్న విధానం ద్వారా రోడ్లపై జనాలకు
సభ్యత్వాలు ఇచ్చారు.. నేనూ సరదాగా సభ్యత్వం తీసుకున్నాను.. అయితే సదరు పార్టీ
ఏనాడు తమ కార్యక్రమాలు, విధానాల సమాచారాన్ని నాకు చెప్పిన పాపాన పోలేదు.. సిమ్
ఇవ్వడానికి ఇప్పడు గుర్తింపు అడుగుతున్నారు.. కానీ రాజకీయ పార్టీలు సభ్యత్వాలు
ఇచ్చేందుకు అవేవీ అడగడం లేదు..
No comments:
Post a Comment