Tuesday, June 4, 2013

లాడ్లీ లక్ష్మీ.. బంగారు తల్లి


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాలికల కోసం బంగారు తల్లి పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఘనంగా ప్రకటించారు.. ఏ సభలో చూసినా ఈ పథకం గురించి గొప్పగా చెబుతున్నారు.. సంతోషం.. ఆడ బిడ్డను భారంగా భావిస్తున్న మన సమాజంలో ఇలాంటి పథకం ఉండాల్సిందే.. అయితే ఈ తరహా పథకం దేశంలో తొలిసారిగా చేపట్టామని ఊదర గొట్టేస్తున్నారు..


నిజానికి ఈ తరహా పథకం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2007 నుండి అద్భుతంగా అమలవుతోంది.. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం లాడ్లీ లక్ష్మి పేరిట ఈ పథకం మంచి ఫలితాలను ఇస్తోంది.. గోవా రాష్ట్రంలో మనోహర్ పారికర్ ప్రభుత్వం లాడ్లీ లక్ష్మీ పథకాన్ని ప్రారంభించింది..
మన రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మొన్నటి దాకా మంత్రిగా ఉన్న డీఎల్ రవీంద్రారెడ్డి బంగారు తల్లి పథకంపై తమకేమీ తెలియదని బహిరంగంగా ప్రకటించేశారు.. మంత్రి వర్గంలో చర్చించకుండా, మంత్రులెవరికీ చెప్పకుండా బంగారు తల్లి పథకాన్ని ప్రకటించారని సీఎంపై రుసరుసలాడారు..
కొద్ది సంవత్సరాల క్రితం నాటి సీఎం రాజశేఖర రెడ్డి బాలికా సంరక్షణ పథకాన్ని ప్రకటించారు.. దాదాపు 3.8 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చినా ఇప్పటికీ నయాపైస కూడా ఇవ్వలేదు.. ఉన్న పథకాన్నే సరిగా అమలు చేయని సర్కారు బంగారు తల్లి పేరుతో కొత్త పథకాన్ని ప్రకటిస్తే నమ్మేదెలా? ఇదేదో కొత్త సీసాలో పాత సార సామెతను గుర్తు చేస్తోంది..
బంగారు తల్లి పథకాన్ని ఇంకా ప్రారంభించకున్నా ప్రచారానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తగలేస్తున్నారు.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆర్భాటపు పథకాలు ప్రకటించే బదులు ఉన్న పథకాలను సక్రమంగా అమలు చేస్తే చాలు..

No comments:

Post a Comment