Friday, June 14, 2013

చలో అసెంబ్లీని విజయవంతం చేశారు..

చలో అసెంబ్లీ విజయవంతమైందా? కాలేదా?.. ఎక్కడ జరిగింది చలో అసెంబ్లీ? ఒక్కరు కూడా అసెంబ్లీని చేరుకోలేకపోయారు.. మరి విజయవంతం ఎలా అయినట్లు?.. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించేవారి సమాధానం..
మన దేశ సరిహద్దులు ఎలా ఉన్నాయో తెలియదు కానీ హైదరాబాద్ ఒక సైనిక స్థావరంలా మారిపోయింది.. రాజధానిలో అడుగడుగునా నిర్భందం.. ఎక్కడ చూసినా పోలీసులే.. చాలా రోడ్లు మూసేశారు.. అసెంబ్లీకి 5 కిలో మీటర్ల దూరం నుండే రోడ్లకు అడ్డంగా బారికేడ్లు, ఇనుప కంచెలు వేశారు.. పోలీసు బలగాలు హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా దిగ్భందించేశాయి.. అడుగడుగునా అరెస్టులు.. తెలంగాణ జిల్లాల నుండి హైదరాబాద్ వచ్చే ప్రతి బస్సు, రైలును తనిఖీ చేశారు.. బీజేపీ, టీఆర్ఎస్, సీపీఐ, న్యూడెమోక్రసీ, తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకులను రాజధానికి రాకుండానే ఎక్కడికక్కడ నిర్భందించారు..
చలో అసెంబ్లీని విజయవంతం కాకుండా అడ్డుకున్నామని ప్రభుత్వం, పోలీసులు చంకలు గుద్దుకోవచ్చేమా? కానీ అక్కడే పప్పులో కాలేశారు.. తమకు తెలియకుండానే వారు చలో అసెంబ్లీని విజయవంతం చేసేశారు?
అసలు చలో అసెంబ్లీ ఉద్దేశ్యం ఏమిటి? అసెంబ్లీని ముట్టడించడమే లక్ష్యం కదా? ఎవరు ముట్టడిస్తే ఏమిటి? పోలీసులతో ముట్టడింపజేశారు కదా? తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను మరోసారి బలంగా చాటి కేంద్ర, రాష్ట్రాల్లో బ్రహ్మచెవుడు, మొద్దు నిద్ర నటిస్తున్న కాంగ్రెస్ నాయకులకు తెలియజేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం.. మరి ఈ విషయంలో తెలంగాణ వాదులు విజయవంతం అయినట్లే కదా?

No comments:

Post a Comment