Tuesday, June 18, 2013

బంగారు తల్లి పథకానికి చట్ట పరమైన భద్రత కల్పిస్తారట.. ఇటీవలే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు ఇలాంటి చట్టబద్దత కోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశ పరిచారు.. సంతోషం..
అంటే రాష్ట్రంలో ఇంత కాలం అమలవుతున్న ఇతర పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చట్ట వ్యతిరేకమైనవా? ప్రభుత్వ జీవోలకు చట్టబద్దత లేదా?.. మరి వీటన్నింటికీ చట్టబద్దత కల్పించ వచ్చుకాదా?
నేను ఇంత కాలం శాసనం ద్వారా ఏర్పాటైన భారత రాజ్యాంగానికి లోబడి ప్రమాణం చేసిన ఈ ప్రభుత్వానికి చట్టబద్దత ఉందనే భ్రమలో ఉన్నాను.. ఈ ప్రభుత్వం అమలు చేసే పథకాలు వేటికీ చట్టబద్దత లేదని ఇటీవలే తెలిసింది..

No comments:

Post a Comment