Tuesday, June 25, 2013

మానవ తప్పిదానికి దైవాన్ని నిందించాలా?


ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అకస్మాత్తుగా వచ్చిన వరదలు పవిత్ర స్థలాలను చుట్టు ముట్టి పెద్ద సంఖ్యలో చార్ ధామ్ యాత్రికులను పొట్టన పెట్టుకున్నాయి.. ఊహకే అందని మహా విపత్తు ఇది.. ఈ ప్రళయానికి కారణం ఏమిటి అంటే కొందరు ప్రకృతి అని చెబుతుంటే, మరి కొందరు మానవ తప్పిదమని అంటున్నారు.. ఈ దశలో కొందరు ఏకంగా దైవాన్నే నిందిస్తూ తమ మూర్ఖత్వాన్ని చాటుకుంటున్నారు.. అసలు వాస్తవం ఏమిటో ఒక్కసారి ఆలోచించండి..
ఊహించని వరదల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని పాలకులు చెబుతున్న ఓ సాకు మాత్రమే.. ఇది కచ్చితంగా మానవ తప్పిదమే.. దైవ భూమిగా భావించే హిమ పర్వత సానువుల్లో వెలిసిన పుణ్య క్షేత్రాలను దర్శించుకొని మోక్షం పొందాలని ప్రతి హిందువూ కోరుకుంటాడు.. ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగానే గుర్తించి భక్తులకు ఏర్పాటు చేస్తే ఎలాంటి తప్పు పట్టలేం.. కానీ దీన్నో పర్యాటక ప్రాంతంగా మార్చేసి ఆదాయం కోసం విచ్ఛల విడిగా భవంతులు కట్టేశారు.. అది కూడా నదులు తీరాలను ఆనుకునే.. ఇక్కడి అడవుల్లో కలప కోసం విచ్ఛల విడిగా అడవులును నరికేస్తున్నారు.. 
మరోవైపు రాజకీయ నాయకులు, వ్యాపారులు తమ స్వార్థ లాభాపేక్ష కోసం ఉత్తరాఖండ్ నదులపై పెద్ద సంఖ్యలో హైడల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.. నదీ ప్రవాహాలకు అడ్డంగా, ప్రణాళికాబద్దంగా లేని ఈ కట్టడాలు పరివాహక ప్రాంతాలపై, భూగర్భంపై విపరీతమైన వత్తిడి పెంచాయి.. వీటన్నింటి దుష్పలితమే ఈ విపత్తు.. ఇక్కడ మనం ప్రకృతిని తప్పు పట్టాలా? మానవ తప్పిదాన్ని తప్పు పట్టాలా ఆలోచించండి?
ఒక అసలు విషయానికి వద్దాం.. ఉత్తరాఖండ్ విపత్తును అడ్డం పెట్టుకొని కొందరు నాస్తికులు, పక్తు భౌతిక వాదులు.. వీరికి తోడు అన్య మతస్తులు హిందూ దేవుళ్లనే నిందించే ప్రయత్నం చేస్తున్నారు.. భక్తులను కాపడలేని, తనను తాను రక్షించుకోలేని దేవుని దర్శనానికి ఉత్తరాఖండ్ వెళ్లాలా? ఇది వారి మూర్ఖ వాదన? ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన రాతలు, వ్యంగ్య చిత్రాల సారాంశం ఇది.. ఆ మాటకొస్తే గతంలో అన్యమతస్థుల పవిత్ర క్షేత్రాల్లో జరిగిన తొక్కిసలాటల్లో అనేక మంది ప్రాణాలు విడిచారు. ఇందుకు ఆ దైవాలను తప్పు పట్టే సాహసం ఎవరైనా చేశారా? మానవ తప్పిదాలకు భగవంతుడు వచ్చి ఈ మూర్ఖులకు సమాధానం ఇవ్వాలా? తమకు భావ ప్రకటనా స్వాతంత్రం ఉందనే ఉందనే సాకుతో ఇతరుల మనోభావాలను, విశ్వాసాలను నిందించడం ఎంత వరకు సమంజసం? అసలు వీరికి ఈ స్వేచ్చ ఎవరిచ్చారు? అడ్డగోలుగా వాదించే ఇలాంటి వారికి బుద్ధి చెప్పేవారే లేరా?




No comments:

Post a Comment