భారత
జాతికి అండ సైనికులు.. తెలుగు జాతికి అండ చంద్రబాబు. జై జవాన్.. జై చంద్రబాబు
పశ్చిమ
గోదావరి జిల్లాలో ఓ టీడీపీ నాయకుడు పెట్టిన ఫ్లెక్సీ ఇది..
భారతీయుల
జాతి వేరు, తెలుగు వారి జాతి అని ఆ నాయకుడు
భావిస్తున్నారా? తెలుగు వారు భారతీయుల్లో భాగం కాదా?
జై
జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్.. నినాదాం వెనుక ఓ స్పూర్తి ఉంది.. దీన్ని రాజకీయ
నినాదంగా మార్చకోవడం సబబేనా..
అభిమానానికీ
హద్దు ఉండాలి.. చంద్రబాబు నాయుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తెలుగు యాత్రికులను
రక్షించేందుకు చొరవ తీసుకోవడం అభినందనీయమే.. కానీ అతి పబ్లిసిటీ బెడిసి కొట్తే
ప్రమాదం ఉంది.. దేశ రక్షణ కోసం అహర్నిమిషం కష్టపడుతూ, ప్రాణాలకు తెగించి ప్రకృతితో పోరాడుతూ
బాధితులను కాపాడుతున్న సైనికులతో చంద్రబాబును పోల్చడం సరికాదు..
చంద్రబాబు
ఓ రాజకీయ నాయకుడు, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన
బాబు గారు ఏమి చేసినా మీడియాలో పబ్లిసిటీ దొరుకుతుంది.. కానీ వీర జవాన్లకు
పబ్లిసిటీ అవసరం లేదు.. దేశం కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్న
సైనికులకు ఓట్లు అవసరం లేదు.. ప్రజల ఆశీర్వాదాలు, అండదండలు కావాలి..
మితి
మీరిన పబ్లిసిటీ కొన్ని సందర్భాల్లో బెడిసికొట్టే ప్రమాదం ఉంది.. బాబుగారి విషయంలో
ఇది చాలాసార్లు రుజువైంది.. ఈ విషయాన్ని టీడీపీ అభిమానులు, కార్యకర్తలు గ్రహించాలి..
No comments:
Post a Comment