Sunday, June 16, 2013

ఇది దేశ సరిహద్దా?

శుక్రవారం నాడు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా ఇనుప కంచెలు, బారికేడ్లు కనిపించాయి.. అడుగడుగునా సాయుధ దళాలు అత్యాధునిక తుపాకులతో కనిపించారు.. ఇక అసెంబ్లీ అయితే ఇండో-పాక్ బార్డర్ లాగానే కనిపించింది.. భాగ్యనగరంలో యుద్ద వాతావరణమే కనిపించింది.. ఆ యుద్దం ఎవరిపైనో కాదు.. పౌరులపైనే..
ఈ ఏర్నాట్లేవో దేశ సరిహద్దుల్లో ఉంటే చైనా చొరబడేదా? పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు, బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసదార్లు వచ్చేవారా?
ప్రజల ఆకాంక్షలను అడ్డుకునే ప్రభుత్వం, దేశ రక్షణ మీద దృష్టి పెట్టదెందుకు?
హైదరాబాద్ నగరాన్ని తుపాకి నీడలోకి నెట్టిన ప్రభుత్వం చివరకు సాధించింది ఏమిటి? ఇలా ఎంతకాలం భాగ్యనగర వాసులను భయకంపితులను చేస్తారు?


No comments:

Post a Comment