కేంద్రంలో యూపీఏ-2 సర్కారు మూడేళ్ల అసమర్థపాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.. ఈ నిర్వాకానికి ఎంతో గర్వపడ్డ ప్రధాని మన్మోహన్ సింగ్ భాగస్వామ్య పక్షలకు విందు ఇచ్చారు.. దేశంలో దారిద్ర్యం తగ్గి వృద్ధి రేటు పెరిగిందంటూ గర్వపడ్డారాయన.. పాపం ఈ రిమోట్ మౌనీ బాబా ఇంతకన్నా చేయగలిగిందేమిటి? రాబోయే రెండేళ్లలో మరింత కఠిన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకెళలానని పాత అరిగిపోయిన రికార్డును మరోసారి వినిపించారు.. యూపీఏ పాలనలో జరిగన కుంభకోణాలు, ధరల పెరుగుదల, పెట్రోధరల భారం, రూపాయి పతనం, దేశ భద్రతపై రాజీ, తెలంగాణ విషయంలో అస్పష్టవైఖరి తదితర వైఫల్యాలపై మాత్రం మౌన వ్రతం పాటించారు.. ఏం చేస్తాం.. మరో రెండేళ్లు ఈ అసమర్థ నాయకత్వాన్ని భరించాలి..
No comments:
Post a Comment