‘
ఏంటేంటి మన ఇద్దరు సీఎంలు జైలులో ఉన్నరా?.. అదీ పక్క రాష్ట్రలోనా?.. ’
‘
అవ్ తమ్మీ నాకు అట్లనే కలొచ్చింది మల్ల.. ’
‘
ఇదేం కల అన్నాయ్.. మన సీఎంలు గా రాష్ట్రం జైళ్లలో ఉండటమేంటి?.. ’
‘
మన ఇద్దరు సీఎంలు ఒకళ్ల మీద ఒకళ్లు కేసు పెట్టుకున్నరు కదా?.. మన
రెండు రాష్ట్రాలకు ఒకటే హైకోర్టు.. ఇక్కడైతే న్యాయం జరగదని, పక్క రాష్ట్ర కోర్టుకు
కేసు బదిలీ చేయమని పనిలేని పాపారావు పిటిషన్ ఏసిండట.. అట్ల కేసు పక్క రాష్ట్రానికి
బదిలీ చేసిండ్రు.. గా పక్క రాష్ట్ర ఒకాలతు మనోళ్లకు ఆడున్న జైలుకు రిమాండు
చేసిందంట.. ’
‘
ఇదెలా సాధ్యం? ఏ రాష్ట్రం కేసులు ఆ రాష్ట్రంలే విచారిస్తారు కదా?..
మరి మన కేసులను పక్క రాష్ట్రానికి ఎందుకు పోతాయి?..’
‘
ఎందుకు సాధ్యం కాదంటవ్? జయమ్మ తశ్వ కర్ణాటక ఒకాలత్ల నడ్వలేద?.. అమె
పరప్పన అగ్రహార జైలుకు పోలేద? ’
‘ అవునన్నాయ్.. ఇదీ నిజమే.. ‘
‘ ఆళ్లే జైలుకు పోరులే తమ్మీ.. గొంగట్ల తింటూ ఎంటుకలు ఏరుతున్న ఇద్దరికీ
ఇంత ఇంగితం వస్తె సాలని కోరుకుంటున్న.. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చె అనె
సామతె తెలుసనుకుంట.. మనం మనం కొట్టుకొని అవతలోనికి ఎందుకు అలుసు గావాలే.. ’
‘
ఇంతకీ నీకు ఈ కల ఎప్పుడొచ్చిందన్నాయ్? ’
‘ ఇయాల పొద్దుగాల వచ్చింది..’
‘ ఆ.. తెల్లవారు ఝామున వచ్చిన కలలు నిజమౌతాయట కదా??? ’
(గమనిక: ఎవరా ఇద్దరు సీఎంలు?.. ఏమా
కేసులు?.. ఇదెలా సాధ్యం అంటూ బుర్రులు బద్దలు కొట్టుకోకుండ్రి.. ఇది కల మాత్రమే
అనుకొని జస్ట్ నవ్వుకోండి.. అంతే..)
No comments:
Post a Comment