‘ ఇంత అన్యాయమా?.. మోదీ స్వేచ్ఛను
హరించేస్తున్నాడు.. ’ అప్పుడే కంప్యూటర్ని షట్ డౌన్ చేస్తూ
గదిలోకి వచ్చిన మీడియా మిత్రునితో అన్నాడా నాయకుడు..
‘ ఏం అన్యాయం? ఎవరికి జరిగింది?.. ’
అసక్తిగా ప్రశ్నిండా విలేఖరి తన
చిరకాల రాజకీయ మిత్రున్ని..
‘ మరీ తెలీనట్లు అడుగుతావేంటి.. అదే పోర్న్ సైట్ల బ్యాన్
గురుంచే నేను మాట్లాడేది.. ’
‘ నిషేధించొద్దంటారా?.. ‘
‘ ఎందుకు నిషేధించాలి?..’
‘ అలాగా.. అయితే మీరు పోర్న్ సైట్ల నిషేధాన్ని
వ్యతిరేకిస్తున్నట్లు రాసుకోమంటారా? ’
‘ఓ నారద మహర్షీ.. నా కొంప కొల్లేరు
చేసేట్టున్నావే.. ఇప్పటికే నా సంసారం అంతంత మాత్రంగా సాగుతోంది.. ఈ వార్త మా ఆవిడ
చూసిందంటే అన్నం పెట్టడం మాట అట్లా ఉంచి. నన్ను ఇంట్లోకి కూడా రానీయదు.. ’
‘ సరే సరే.. నేనేం రాయనులే.. కానీ మీరు రెగ్యులర్
గా ఆ సైట్లను చూస్తుంటారా?.. ’ ఇంకా
షట్ డౌన్ పూర్తి కాని కంప్యూటర్ వైపు ఆసక్తిగా చూస్తూ అడిగాడా మీడియా మిత్రుడు..
‘ ఏం చూస్తే తప్పేంటి?.. నాకు ఆ స్వేచ్ఛ ఉంది..’
‘ ఓహో.. అయితే ఇంట్లో మీ పిల్లలకు కూడా ఆ స్వేచ్ఛ
ఇచ్చారా?..’ ఈ ప్రశ్నకు అవాక్కైపోయాడు మన నాయకుడు.
‘ ఓకే మీరు ఇబ్బంది పడ్డారని నాకు అర్థమైంది.. చివరి
ప్రశ్న.. మీరు ఆ సైట్లు చూస్తారన్న విషయం మీ ఇంట్లో తెలుసా?...’
పాపం బిత్తరబోయాడు నాయకుడు.
‘ నారద మహర్షీ.. ఈ రోజుకు మీకు టీ కూడా
ఇచ్చుకోలేను.. తమరు దయచేస్తారా?.. ’
సవినయంగా గెటవుట్ అని చెప్పాడా నాయకుడు.
‘ సరే నా టీ కూడా మీరే తాగేయండి.. మళ్లీ వస్తా.. ‘ కుర్చీ లోంచి లేచి బయటకు వచ్చేశాడు మన మిత్రుడు..
No comments:
Post a Comment