తెలంగాణ అంతటా బోనాల పండుగ జరుపుకుంటున్న వేళ అంతకన్నా పెద్ద పండుగ
జరుపుకోవాల్సిన అవసరం వచ్చింది.. బోనాలే కాదు.. బతుకమ్మ, దసరా, సంక్రాంతి, ఉగాది
లాంటి పండుగలన్నీ ఒక్కసారిగా చూస్తున్నంత ఆనందంగా ఉంది..
అమర వీరుల త్యాగం వృధా పోలేదు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ అధిష్టానం దిగిరాక తప్పలేదు..
ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిస్తున్నసుధీర్ఘ పోరాటం ఫలించింది.. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదు.. తెలంగాణ ప్రజలందరిదీ ఈ విజయం..
ఈ పోరాటం ఇంతటితో ఆగిపోరాదు.. మనకు కావాల్సింది భౌగోళిక తెలంగాణ కాదు.. సువర్ణ తెలంగాణ కావాలి.. ఆకలి, పేదరికం, నిరుద్యోగం లేని.. అందరికీ సమాన అవకాశాలు గల తెలంగాణ రావాలి.. అన్నిరంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా తెలంగాణను నిలుపుదాం..
మన పోరాటం దోపిడి మనస్థత్వం గత నాయకులపైనే.. తోటి తెలుగువారైన సీమాంధ్ర ప్రజలు మనకు శాశ్వత సోదరులు.. తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉన్నందుకు గర్విద్దాం.. ఉమ్మడిగా ముందుకు సాగుదాం..
ముందు మనం భారతీయులం.. ఆ తర్వాతే తెలంగాణ రాష్ట్ర వాసులం..

No comments:
Post a Comment