మంచికి మారు పేరు..
అజాత
శత్రువు, మంచికి మారు పేరైన రవి శంకర ప్రసాద్ గారు ఇక లేరనే వార్త
దిగ్భ్రాంతికి గురి చేసింది.. రవి శంకర్ ప్రసాద్ గారి నేతృత్వంలో తేజ
న్యూస్ (తర్వాత జెమిని న్యూస్) ప్రారంభమైనప్పడు నేను ఆ సంస్థలో చేరాను..
ఉద్యోగులను ఏంతో ఆత్మీయంగా చూసుకునేవారు.. వారి కష్ట సుఖాలు వాకబు చేసి,
అవసరమైతే సహాయం కూడా చేసిన గొప్ప మనసు రవిశంకర్ ప్రసాద్ గారిది.. మంచి
వార్తలు, స్టోరీలు ఇచ్చినప్పడు ప్రత్యేకంగా అభినందించే వారు.. ఒకసారి నేను
ఒక స్టోరీ కోసం బయలు దేరితే ఆఫీస్ వాహనం దొరకలేదు.. అది గమనించి తన సొంత
కారు ఇచ్చి పంపడం నేను ఎప్పటికీ మరవలేను.. ఒక సంక్షోభ సమయంలో న్యూస్
డిపార్ట్ మెంట్ పని తీరుకు మెచ్చి, అందరికీ వ్యక్తిగత హోదాలో ఇక నెల జీతం
పారితోషికంగా ఇచ్చారు.. అలాంటి మహోన్నత వ్యక్తిని కోల్పోవడం నాకు ఎంతో
విచారాన్ని కలిగించింది.. వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని
కోరుకుంటున్నాను..
No comments:
Post a Comment