నేను మూడో తరగతిలో ఉన్ప్పడు అనుకుంటా..
సర్దార్జీల గురుంచి ఓ మిత్రుడు చెప్పిన జోక్ ఇది.. సముద్ర తీరంలో ఓ సిక్కు యువకుడు
రన్నింగ్ చేసి అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటుంటాడు.. ఓ విదేశీయురాలు ‘ఆర్ యు రిలాక్సింగ్?..’ అని అడిగింది.. ఇంగ్లీషు అంతగా రాని మన
సర్దార్జీ ‘నో నో అయామ్
మిల్ఖాసింగ్..’ అంటూ తడబడుతూ
సమాధానం చెప్పాడు..
అప్పటికి నాకు ఇంకా తెలియదు మిల్ఖాసింగ్ అంటే భారత దేశం గర్వించదగ్గ గొప్ప అథ్లెట్ అని.. ఆ విషయం తెలిసేందుకు మరో ఏడాదిన్నర పట్టింది.. నేనూ ఆయనంత గొప్పగా కాకున్నా పరుగు పందెంలో రాణించాలనుకున్నా.. పాఠశాల స్థాయిలో కొన్ని ఫలితాలు సాధించినప్పటికీ దాన్ని కొనసాగే అదృష్టం లేకపోయినందుకు ఇప్పటికీ చింతిస్తుంటాను..
తెరపై కనిపించే అర్థంలేని హీరోయిజాలు, నిజ జీవితంలో కనిపించని వారి నకిలీ ఫీట్లు, అర్థం పర్థంలేని రొటీన్ ప్రేమ కథలు నచ్చని నేను సాధారణంగా సినిమాలు చూడటం చాలా అరుదు.. నేను అభిమానించే ‘ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్’ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘భాగ్ మిల్ఖా భాగ్’ మా అబ్బాయితో కలిసి చూశాను..
చిన్న వయస్సులో
దేశ విభజన కారణంగా తల్లి దండ్రులను పోగొట్టుకున్న మిల్ఖాసింగ్ కట్టు బట్టలతో
ఢిల్లీ వచ్చి అల్లరి చిల్లరగా తిరగడం, ఆ తర్వాత ఆర్మీ చేరడం.. పాలు, గుడ్లు అధనంగా
లభిస్తాయనే ఆశతో పరుగు పందాన్ని ఎంచుకొని భారత తరపున అంతర్జాతీయ క్రీడల్లో విజయాలు
సాధించడం కళ్లకు కట్టినట్లు చూపించారు ఈ చిత్రంలో.. మిల్ఖాసింగ్ గా ఫర్హాన్ అఖ్తర్
చాలా అద్భుతంగా నటించారు.. ఎంతో స్పూర్తిదాయకమైన మిల్ఖాసింగ్ జీవితాన్ని ఈ చిత్రం
ద్వారా తెరకెక్కించిన దర్శక నిర్మాత ఓంప్రకాశ్ మెహ్రా అభినందనీయుడు.. ప్రతి
ప్రేక్షకుడు, క్రీడాభిమాని తప్పకుండా చూడదగ్గ చిత్రం ఇది.. చిన్నప్పుడు నేను విన్న
రిలాక్సింగ్ జోక్ ఈ చిత్రంలో కనిపించడం గమనార్హం..

భాగ్ మిల్ఖా భాగ్ చిత్రం విడుదలై రెండో వారం అవుతున్నా సినిమా హాళ్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి, ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదు.. కానీ కొందరు తెలుగు సినీ పెద్దల మాయాజాలంలో చిక్కుకున్న మన సినిమా హాళ్లు, పంపిణీ వ్యవస్థ కారణంగా హైదరాబాద్ నగరంలో రెండో వారానికే చాలా థియేటర్ల నుండి ఈ సినిమాను ఎత్తేశారు.. ఇది కొంత బాధాకరమైన విషయమే..
అప్పటికి నాకు ఇంకా తెలియదు మిల్ఖాసింగ్ అంటే భారత దేశం గర్వించదగ్గ గొప్ప అథ్లెట్ అని.. ఆ విషయం తెలిసేందుకు మరో ఏడాదిన్నర పట్టింది.. నేనూ ఆయనంత గొప్పగా కాకున్నా పరుగు పందెంలో రాణించాలనుకున్నా.. పాఠశాల స్థాయిలో కొన్ని ఫలితాలు సాధించినప్పటికీ దాన్ని కొనసాగే అదృష్టం లేకపోయినందుకు ఇప్పటికీ చింతిస్తుంటాను..
తెరపై కనిపించే అర్థంలేని హీరోయిజాలు, నిజ జీవితంలో కనిపించని వారి నకిలీ ఫీట్లు, అర్థం పర్థంలేని రొటీన్ ప్రేమ కథలు నచ్చని నేను సాధారణంగా సినిమాలు చూడటం చాలా అరుదు.. నేను అభిమానించే ‘ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్’ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘భాగ్ మిల్ఖా భాగ్’ మా అబ్బాయితో కలిసి చూశాను..

భాగ్ మిల్ఖా భాగ్ చిత్రం విడుదలై రెండో వారం అవుతున్నా సినిమా హాళ్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి, ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదు.. కానీ కొందరు తెలుగు సినీ పెద్దల మాయాజాలంలో చిక్కుకున్న మన సినిమా హాళ్లు, పంపిణీ వ్యవస్థ కారణంగా హైదరాబాద్ నగరంలో రెండో వారానికే చాలా థియేటర్ల నుండి ఈ సినిమాను ఎత్తేశారు.. ఇది కొంత బాధాకరమైన విషయమే..
No comments:
Post a Comment