Sunday, December 31, 2017
తమిళనాడుకు రజినీయే బెస్ట్
Saturday, December 30, 2017
ఇక ఉమ్మడి పౌరస్మృతి దిశగా
Wednesday, December 27, 2017
మనువు పేరుతో ధర్మంపై దాడి
జైల్ మే రహేగా లాలూ..
సత్వర న్యాయం జరగడంలో తీవ్ర జాప్యం కారణంగా నేరగాళ్లు కాలర్ ఎగరేస్తూ సమాజాన్ని శాసించడం దురదృష్టకరం. రాంచీ సీబీఐ కోర్టులో దోషిగా తేలిన లాలూ శిక్షను తప్పించుకోవడానికి హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టులను ఆశ్రయించడం ఖాయం.. ఈలోగా ఆయన శిక్షను పూర్తిగా అనుభవించకుండానే నూకలు చెల్లిపోవడం ఖాయం అనిపిస్తోంది..
కోట్లాది రూపాయ ప్రజా ధనం అడ్డగోలుగా దోచుకుంటూ తరతరాలకు సరిపడే సంపదను, వారసత్వ అధికారాన్ని చలాయించే నాయకులకు ఐకాన్ లాలూ ప్రసాద్ యాదవ్. ఇప్పుడు దాదాపుగా ఆయన కుటుంబ సభ్యులంతా కేసులు ఎదుర్కొంటున్నారు. వీరికి తర్వగా శిక్షలు విధించడమే కాదు, దోచుకున్న సంపదనంతా రాబట్టి బిహార్ ఖజానాకు దాఖలు చేయాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి నాయకులు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, రాంమనోహర్ లోహియా వారసులం అటూ, వారి ఆశయాలకే తూట్లు పొడుస్తున్నారు. సమాజాన్ని కులాల పేరిట చీలుస్తూ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి చీడ పురుగులను భారత రాజకీయాల నుంచి శాశ్వతంగా వదిలించుకోవాల్సిన అవసరం ఉంది.
పై కోర్టులలో త్వరిత గతిన విచారణ పూర్తయి ‘జబ్ తక్ సమోసేమే రహేగా ఆలూ.. జైల్ మే రహేగా లాలూ..’ అని వినాలని కోరుకుంటున్నాను నేను..
24.12.2017
అర్థంలేని ఆరోపణలు
యూపీఏ ప్రభుత్వ హయాంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని బయట పెట్టింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్).. 2008లో జరిగిన కేటాయింపులకు 2001 నాటి ధరలను ప్రామాణికంగా తీసుకొని అస్మదీయులకు కేటాయింపులు జరిపారని ఆరోపణ. మంత్రి రాజా తన కుటుంబ వ్యాపార కార్యకలాపాలతో సంబంధం ఉన్న యూనిటెక్, డాట్ కామ్, స్వాన్ కంపెనీలకు కట్టబెట్టడాన్ని 2012లో స్వయానా సుప్రీం కోర్టు గుర్తించి 122 లైసెన్సులపై వేటు వేసింది..
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్ష కోట్ల నష్టం జరగిందని కాగ్ నిర్ధారించింది. ఇక్కడ గమనించాల్సిన విషయంలో ఒకటి ఉంది. కుంభకోణం జరిగింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో, కుంభకోణంతో సంబంధం ఉన్న వారు కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే పార్టీకి చెందిన రాజా, ఆ పార్టీ అధినేత కరుణానిధి తనయ ఎంపీ కనిమొళి.. మరి కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ సంస్థ ఎవరి కనుసన్నల్లో పని చేసినట్లు.. ఆ సమయంలోనే కీలకమైన పత్రాలను తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. ఒక రకంగా కేసు అప్పుడే నీరు గారింది..
తాజాగా సీబీఐ న్యాయస్థానం తీర్పు చెప్పే సమయానికి ప్రాసిక్యూషన్ వాదన వీగిపోయింది. సాక్ష్యాలను ప్రవేశ పెట్టడంలో విఫలం అయ్యారని న్యాయమూర్తి సైతం వ్యాఖ్యానించడం గమనార్హం.. మరి ఇక్కడ మోదీ ప్రభుత్వ ప్రమేయం ఎక్కడ ఉన్నట్లు?. కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన డీఎంకే అధినేత కరుణానిధిని కలవడం ఇక్కడ ప్రస్థావనకు వస్తోంది..
కరుణానిధిని పరామర్శించడమే మోదీ చేసిన నేరమా?. దీనికి, తాజా తీర్పుకు ముడి పెట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. డీఎంకేను తమవైపు తిప్పుకోవడానికే స్పెక్ట్రమ్ కేసును బీజేపీ ప్రభుత్వం నీరు గార్చిందని వాదన. మోదీ ప్రభుత్వం నిజంగా న్యాయస్థానాలను, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసిందని నమ్మగలమా? ఇదే నిజమైతే ఇటీవల చాలా కేసుల్లో న్యాయస్థానాలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయి. అంత పెద్ద కుంభకోణాన్నే ప్రభావితం చేసిన మోదీ, చిన్నా చితకా కేసుల్లో తన ప్రభుత్వాన్ని తప్పు పట్టకుండా చూసుకోలేరా?
నిజానికి 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం న్యాయస్థానానికి చేరేందుకు కారణం బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి.. ఆయన ఈ కేసును అంత తేలికగా వదిలి పెట్టరు.. పై కోర్టుల్లో ఈ వ్యవహారాన్ని తేల్చేందకు అప్పుడే సిద్దమైపోయారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు పండుగ చేసుకుంటూ ఉండొచ్చు.. అసలైన మొసళ్ల పండుగ ముందు ముందు ఉంటుంది.
22.12.2017
వారు ఎలా అమాయకులో?
ఇదేం నైతిక విజయమో?
గుజరాత్ అసెంబ్లీలో వరుసగా ఆరోసారి గెలిచింది భాజపా.. రెండు దశాబ్దాల పాలనలో ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత సహజం.. అయినా గెలిపించారు గుజరాతీలు.. ఈ వాస్తవాన్ని గుర్తించలేక తామే గెలిచామన్నంత సంబరపడిపోతున్నారు కాంగ్రెస్ వారు. వాస్తవానికి వారు అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ను కోల్పోయినందుకు బాధ పడాలి.. కానీ కింద పడ్డా నైతిక విజయం తమదే అని గొప్పలకు పోతున్నాడు రాహుల్ గాంధీ..
మోదీ విశ్వసనీయతపై, గుజరాత్ అభివృద్ధి నమూనాపై సందేహాలట.. రాహులయ్యా!.. గుజరాతీలు మోదీపై విశ్వాసంతోనే మళ్లీ భజపాకు అధికారం ఇచ్చారు అన్న వాస్తవాన్ని ఎందుకు జీర్ణించుకోలేపోతున్నారు?.. గుజరాతీలకు మీ విశ్వసనీయతపై సందేహం కారణంగానే మీకు అధికారం ఇవ్వలేకపోయారు.. కాకపోతే సమర్ధవంతమైన ప్రతిపక్ష పాత్రను మరోసారి ఇచ్చి గౌరవించారు.. దీన్ని అంగీకరించలేకపోతే మీ కర్మ 2019లో ఇలాగే తిరగబడతది..
మొత్తానికి కాంగ్రెస్ కు భలే సారథి దొరికాడు.. ఆయన చేతిలోని స్టీరింగ్ ఎంత భద్రమో మరో రెండేళ్లలోపే తెలిసివస్తుంది..
20.12.2017
Tuesday, December 19, 2017
గుజరాత్ ఎన్నికల ఫలితాలు బీజేపీకే లాభదాయకం
Friday, December 15, 2017
అమరనాథ్ యాత్రపై మతిలేని ఆంక్షలు
' అమరనాథ్ గుహలో గంట కొట్టరాదు.. మంత్రాలు చదవరాదు.. కొబ్బరికాయ కొట్టరాదు..' ఇలాంటి ఆంక్షలను చూస్తుంటే అమరనాథ్ యాత్రపై ఎందుకు ఇంత కక్ష అనిపించడం లేదా?
ఏటా లక్షలాది మంది యాత్రీకులు హిమాలయ గుహలో మంచు లింగం రూపంలో వెలిసిన భోళా శంకరున్ని దర్శించుకుంటారు.. ఈ భక్తుల మనోభావాలను దెబ్బతీసే హక్కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఎవరు ఇచ్చారు?..
మధ్యయుగంలో హిందువుల తీర్థయాత్రలపై జిజియా పన్ను విధించేవారు.. ఇంకా నయం ఇలాంటి పన్నును అమరనాథ్ యాత్రీకులపై విధించాలని సిఫార్స్ చేయలేదు..
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధిస్తున్న తలతిక్క తుగ్లక్ ఆంక్షలను ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలి..
Wednesday, December 13, 2017
అంత రహస్యం ఏమిటో?
‘ఉల్టా చోర్ కొత్వాల్ కో మారా..’ తాము చేసిన పనికి సిగ్గు పడకుండా ఎదురుదాడికి దిగడం ఎందుకో?..
గుజరాత్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు పాకిస్తానీ నాయకులతో సమావేశం కావడం దేనికి సంకేతం?.. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్థావించగానే ‘దూడ గడ్డి కోసం తాటిచెట్టు ఎక్కాం..’ అన్నట్లు ఆ పార్టీ వివరణ ఇచ్చుకోవడం ఏమిటి?.. ‘మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి..’ అంటూ పాకిస్తాన్ ప్రకటించడం.. ‘అసలు పాకిస్తాన్, చైనాల ప్రస్థావన ఎందుకు?, ప్రధాని క్షమాపణ చెప్పాలి’ అని కాంగ్రెస్ భుజాలు తడుముకోవడం దేనికి సంకేతం.. గతంలో కూడా రాహుల్ గాంధీ చైనా నాయకులను రహస్యంగా కలుసుకోవడం, ఒక విదేశీ ప్రతినిధుల విందులో దేశ రాజకీయాల గురుంచి నోరు జారడం అందరికీ తెలిసిందే..
తాజా ఘటనలో నిజంగానే కాంగ్రెస్ పార్టీకి నిజంగానే దురుద్దేశ్యం లేకపోతే భాజపా నాయకులు బయట పెట్టే దాకా భేటీ విషయాన్ని ఎందుకు దాచారు?.. పైగా ఈ సమావేశం జరిగింది ప్రధానిని ‘నీచ్’ అంటూ దుర్భాషలాడిన మణిశంకర్ అయ్యర్ ఇంట్లో.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మరి కొందరు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్న ఈ సమావేశం పాకిస్తాన్ మాజీ మంత్రి గౌరవార్థం అట..
బురదలోకి దిగి తమకు మరకలు అంటించొద్దని హెచ్చరించడం అంటే ఇదే మరి.. పాకిస్తాన్ నాయకులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపిందంటే దానికి ఒక అధికార హోదా ఉంటుంది.. చర్చల సారాంశం కూడా అందరికీ తెలుస్తుంది.. కానీ కాంగ్రెస నాయకులు ఏ హోదాలో శత్రు దేశం నాయకులతో సమావేశమైనట్లు? పైగా రహస్యంగా ఎందుకు దాచిపెట్టినట్లు? అందునా గుజరాత్ ఎన్నికల వేళ భేటీ ఏమిటి?.. పైగా అడిగితే దబాయింపు..
(12.12.2017)
Thursday, December 7, 2017
కాంగ్రెస్ కు అయ్యరోరి కష్టాలు
మందిర్ వహీ బనాయేంగే..
దేశ చరిత్రను మలుపు తిప్పిన రోజు ఇది.. రామ జన్మభూమిపై విదేశీ దండ యాత్రికుడు బాబర్ నిర్మించిన కట్టడాన్ని తొలగించిన రోజు.. కుహనా లౌకికవాదం చావుదెబ్బ తిని, జాతీయవాదం మేల్కొన్న సందర్భం.. శ్రీరామ జన్మభూమి ఉద్యమం మరో స్వతంత్ర పోరాటంలా సాగింది.. వందలాది మంది ప్రాణత్యాగం చేశారు.. దురదృష్టం కొద్దీ న్యాయస్థానాల సుదీర్ఘ జాప్యం కారణంగా నేటికీ జన్మభూమిలో రామ్ లల్లా ఆలయం సాకారం కాలేదు.. అయోధ్యలో రాముని గుడి నిర్మించి నప్పుడే ఈ పోరాటం ఫలించినట్లు.. అప్పటి వరకు సాగాల్సిందే ఈ పోరు..
సౌగంథ్ రామ్ కీ ఖాతే హై.. మందిర్ వహీ బనాయేంగే... జై శ్రీరాం
Tuesday, December 5, 2017
కాంగ్రెస్ ముక్త్ దిశగా మరో అడుగు
'కాగల కార్యం గంధర్వులే తీర్చారు’.. అన్నట్లు 'కాంగ్రెస్'కాంగ్రెస్ ముక్త్ ముక్త్ భారత్ అభియాన్’కు ఆ పార్టీ నాయకులు సైతం సమిధలు అందించారు. రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికోవడం ద్వారా.. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందిట.. రాహుల్ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష హోదాల్లో సాధించిన విజయాలు ఏవీ లేవు.. ఆయన ప్రచార బాధ్యతలు చేపట్టిన చోటల్లా ఓటమే కనిపిస్తోంది.. ఒకటి అరా స్థానిక కారణాల వల్ల సాధించిన గెలుపును యువరాజా ఖాతాలోకి నెట్టే ఆ పార్టీ క్యాడర్, వైఫల్యాలకు మాత్రం ఏనాడూ ఆయన్ని బాధ్యున్ని చేయలేదు..
కాంగ్రెస్ పార్టీలో హేమా హేమీ నాయకులు ఉన్నారు.. కానీ వారికి సోకాల్డ్ ‘గాంధీ – నెహ్రూ’ఫ్యామిలీయే ముద్దు. జవహర్ లాల్ నెహ్రూ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ వంశ పారంపర్యం అయిపోయింది. పార్టీలో అగ్ర నేతలను కాదని తన కూతురు ఇందిరా గాంధీని ప్రోత్సహించాడా మహానుభావుడు. సీనియర్లకు పొగబెట్టే కార్యక్రమాన్ని ఇందిర విజయవంతంగా పూర్తి చేసింది. వారసునిగా సంజయ్ గాంధీని నిశ్చయించినా, ఆయన విమాన ప్రమాదంలో మరణించాడు. దీంతో అనివార్యంగా రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చాడు. ఇందిర హత్యానంతరం ప్రధానమంత్రి పదవితో పాటు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
రాజీవ్ హత్య తర్వాత విషాదంలో మునిగిపోయిన సోనియా గాంధీని కోటరీ నాయకులు కదిలించే సాహసం చేయలేక మెతక మనిషి కదా అని పీవీ నరసింహారావును అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.. ఆ తర్వాత ఆయనే ప్రధాన మంత్రిగా అయ్యారు. శాంత స్వభావుడు అనుకున్న పీవీ కాస్తా ఏకు మేకై అసలు సిసలు నారసింహుని అవతారం చూపడంతో కోటరీ పప్పులు ఉడకలేదు.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమికి బాధ్యున్ని చేసి పీవీని అన్యాయంగా తప్పించారు. సీతారాం కేసరి అనే విధేయున్ని మధ్యేమార్గంగా తోలుబొమ్మ అధ్యక్షునిగా పెట్టుకొని, చివరకు సోనియా గాంధీ చేతికి పగ్గాలు అప్పగించారు.
తర్వాత కథ అందరికీ తెలిసిందే.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాకు ఎన్నికల్లో తన పార్టీ గలిచినా విదేశీయత కారణంగా ప్రధాని పదవి దక్కలేదు. దీనికి‘త్యాగం’ అనే పేరు పేట్టేశారు.. గత్యంతరం లేక మంచివాడైన మెతక మనిషి మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేసి రిమోట్ కంట్రోల్ పాలన నడిపింది సోనియా గాంధీ.. పాపం ఆ పెద్దాయన తనకు తెలియకుండానే అవినీతి మరకల పాలన అందించారు.
అనారోగ్యంతో బాధ పడుతున్న సోనియా గాంధీ తన తనయుడు రాహుల్ గాంధీని ఎనాడో పార్టీ అధ్యక్షున్ని చేయాలనుకున్నా, ఆయన చిపల చిత్తం కారణంగా ఆ సాహసం చేయలేక పోయింది. నాయకత్వ బాధ్యతలపై నేర్పు వచ్చేందుకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, అంతగా ఆయన ఉపయోగించుకోలేక పోయారు. కూతురు ప్రియాంకకు బాధ్యతలు ఇద్దామంటే ఇప్పటికే ఆమె పతి దేవుడు స్కాముల్లో మునిగిపోయాడు. చివరకు రాహుల్ కు పగ్గాలు అప్పగించక తప్పలేదు..
రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినందుకు అందరికన్నా హ్యాపీగా ఉన్నది కమలనాథులే..
Monday, November 27, 2017
వేదాల మీద విషం కక్కుడు ఎందుకు?
వేదాలు కర్ణకఠోరం.. ఎవరు వింటారు వాటిని.. కంపు.. అన్ హ్యూమన్.. న్యూసెన్స్.. ఇళ్ల మధ్య వేద పాఠశాల పెడతారా?.. లొల్లితో సాటి మనుషులను బాధ పెడతారా?.. ఇంగిత గ్నానం ఉందా?.. అడవుల్లో పెట్టుకొని నేర్పించవచ్చు కాదా.. తక్షణం ఖాళీ చేయడండి.. లేకపోతే ఏం చేయాలో అది చేస్తా.. వేదాలు నేర్చుకునే ఆ విద్యార్థులను ఏట్లోకి పంపండి..
ఒక రాజకీయ పార్టీకి చెందిన అడ్డ గాడిద కూతలు ఇవి.. వేద పాఠశాల నిర్వాహకులను ఫోన్లో అనరాని మాటలు అని, బండ బూతులతో బెదిరించాడు.. ధర్మ రక్షణ కోసం వేదాలను భావితరాలకు అందించడమే ఆ పండితుడు చేసిన నేరం మరి..
మీ పెళ్లిళ్లు వేద మంత్రాల సాక్షిగా జరగాలి.. ఇంట్లో శుభ కార్యాలకు, గుడిలో అర్చనలు, సన్మానాలు, సత్కారాలకు వేద పండితుల ప్రార్ధనలు, ఆశీస్సులు కావాలి.. కానీ వేద పాఠశాలు అక్కర లేదు.. ఇళ్ల మధ్య వేద పాఠశాలలు ఉండరాదు..
అన్యమతాల ప్రార్ధనాలయాలు, విద్యాసంస్థలు మాత్రం నిరభ్యంతరం ఉండొచ్చా?.. వాటి వల్ల ఎలాంటి న్యూసెన్స్ లేదా?..
వాహ్వా.. క్యాబాత్ హైజీ.. తాలీ భజావ్.. సెక్యులరిజమా వర్ధిల్లు.. సనాతన ధర్మం, సంస్కృతి ఇంతగా హేళనలకు గురవుతున్నా, భరిస్తున్న మొద్దు చర్మం హిందువులు ఉన్నంత కాలం ఈ దేశంలో ఇలాంటి కూతలు భరించాల్సిందే.. నపుంసక రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలతో స్వధర్మాన్నే నిర్వీర్యం చేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే.. ఎందుకంటే ఎదిరిస్తే కమ్యూనల్ అవుతాం..
Sunday, November 19, 2017
ఇది ఇవాంక కథ కాదు
కొన్నేళ్ళకు మహారాజు గారి ముద్దుల రాకుమారి లోక సంచారం తలపెట్టింది. ఎందుకైనా మంచిదని మహారాజు గారు రాకుమారి వెళ్లే దేశాలకు లేఖలు పంపారు. ' మీ దేశానికి వస్తున్న నా కూతురుకు బిచ్చగాళ్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోగలరు..' అని ఉందా ఉత్తరాల్లో..
ఈ లేఖను చూసిన దేశాల పాలకులు వెంటనే అప్రమత్తమయ్యారు.. ఎంతైనా అవతలి మహారాజు బలవంతుడు. ఆయన కోరికను మన్నించి సామరస్యంగా వ్యవహరిస్తే మనకే ప్రయోజనం కదా అనుకున్నారు. మొత్తానికి దేశాల్లో 'ఆపరేషన్ యాచక' అమలైంది..ఇదఇమహారాజు గారి కూతురు వెళ్లిన ఒక దేశంలో పొరపాటున ఆమెకు ఓ బిచ్చగాడు కనిపించాడు. వాడు అప్పుడే ఊరు నుంచి రాజధానికి వచ్చాడు. ఆపరేషన్ యాచక అమలులో ఉన్న సంగతి తెలియదట.
తర్వాత ఏమైంది?..
సినిమాలు చూడలేదా?.. షరా మాములే.. రాకుమారి వాడితో లవ్వులో పడింది.. కొన్ని రీళ్ల కథ నడిచాక కైమాక్స్ లో మహారాజు గారు బిచ్చగాడికి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేశాడు.
గమనిక: ఇవాంక హైదరాబాద్ పర్యటనకు, ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు.
(15.11.2017)
Wednesday, November 8, 2017
వీరితోనే మనకు ముప్పు
ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు జన్మనిచ్చిన భారత దేశంపై, జాతీయ గీతంపై, హిందూ మతంపై అదే పనిగా విషం కక్కుతున్నారు.. అదే సమయంలో పార్లమెంట్ మీద దాడి చేసిన, ముంబై బాంబు పేలుళ్ల దోషులకు మరణ శిక్ష వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగింది ఈ బ్యాచే.. కశ్మీరీ వేర్పాటు వాదులకు, తీవ్రవాదులకు, విచ్ఛిన్నకర శక్తులకు బాహటంగా మద్దతు ఇస్తున్నారు.. బీఫ్ ఫెస్టివల్స్, కిస్ ఆఫ్ లవ్, లవ్ జిహాదీ గాళ్లకు వంతపాడుతున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి ఆనందిస్తున్నారు.. భారత దేశ సార్వభౌమత్వం, రాజ్యాంగంపై ఏమాత్రం నమ్మకం లేదు వీరికి.. కానీ వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.. ఎందుకు ఇంత అసహనం వీరికి?
అసలు వీరంతా ఎవరు? ఆరా తీస్తే విచిత్రమైన వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయి కొందరివి.. ఈ జాబితాలో స్వయం ప్రకటిత మేధావులు (మేతావులు), కవులు - కళాకారులు - ప్రజాసంఘాలు - విద్యావంతులం అని గప్పాలు కొట్టుకునేవారు, చట్ట విరుద్దంగా హిందూ మత కులాల రిజర్వేషన్లు పొందిన అన్య మతస్తులు, మిషనరీలు-విదేశీ నిధులతో పని చేస్తున్న సోకాల్డ్ ఎన్జీవోలు.. రకరకాల సంస్థలు, బ్యానర్లు, లెటర్ ప్యాడ్ల మీద పని చేస్తున్న ఈ పేపర్ టైగర్లన్నీ ఒకే లక్ష్యంతో పని చేస్తున్నాయి. అన్నట్లు ఈ జాబితాలో ఇటీవల కొందరు సినీ నటులు కూడా చేరి తమాషా రక్తి కట్టిస్తున్నారు.
వీరిలో కొందరి వ్యక్తిగత జీవితాలు పరమ అసహ్యం.. విలువలు, సామాజిక కట్టుబాట్లు గాలికి వదిలేసి విచ్ఛల విడిగా జీవిస్తున్నారు. అదేమంటే వ్యక్తిగతం అని నంగనాచి కబుర్లు చెబుతారు. పైకి మాత్రం సిద్దాంతాలు, నీతులు వళ్లిస్తారు.. మైకులు పట్టుకొని స్పీచులు దంచుతారు..
ఇలాంటి వారికి కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ భిన్న ధృవ పార్టీలకు ఏ సైద్ధాంతిక ప్రాతిపదికన అవగాహన కుదిరిందో, ఎలా డీఎన్ఏ మ్యాచ్ అయిందో దేవుడెరుగు.. సారీ వీరు దేవున్ని నమ్ముతారో తేదో తెలియదు.. నమ్మినా ఏ దేవున్ని నమ్ముతారో అసలు తెలియదు..
నాకు అర్థం అయింది ఏమిటంటే.. వీరంతా మోదీ ఫోబియాతో బాధ పడుతున్నారు.. అయ్యా.. మీకు మోదీ మీద, బీజేపీల మీద కోసం ఉంటే రాజకీయంగా తీర్చుకోండి.. అంతే కానీ దీన్ని అడ్డు పెట్టుకొని ఈ దేశం, మెజారిటీ ప్రజల విశ్వాసాలతో మాత్రం ఆటలాడుకోండి.. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి సమాజంలో విధ్వేషం రగిలించే పనులు చేయకండి.. మేం ఇలాగే చేస్తాం (కుక్క తోక వంకర) అంటారా? మూల్యం మీరే చల్లించుకోవాల్సింది ఉంటుంది.. ఈ దేశ ప్రజల సహనానికి కూడా హద్దు ఉంటుందని గుర్తుంచుకోండి..
ఇది చదివి ఎవరైనా భుజాలు తడుముకుంటున్నారా?.. అందుకు నేను బాధ్యున్ని కాదు.. అది వారి కర్మ..
నల్లధనంపై చారిత్రక పోరాటం
నల్లధనంపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ₹.500, 1000 నోట్లను రద్దు (Demonetisation) చేసి ఏడాది అవుతోంది.. దేశ ఆర్థిక చరిత్రలో ఇది సాహసోపేతమైన నిర్ణయం.. దశాబ్దాలుగా పేరుకు పోయిన నల్లధనం ఒక్కసారిగా మాయం అవుతుంది అని ఎవరూ భావించలేరు. కానీ ఈ దిశగా ఒక అడుగు పడింది..
పురాతనకాలంలో మంచి పని చేపట్టినప్పుడు రాక్షసులు అడుగడుగునా అడ్డుపడేవారు.. ఇప్పుడు మోదీజీ చేపట్టిన యజ్ఞానికి కూడా ఇదే పరిస్థితి.. ప్రశంసించడం ఇష్టం లేకుంటే గమ్మున ఉండి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూసి స్పందించాలి.. కానీ ఆరంభం నుంచే తుమ్మలు మొదలయ్యాయి. ఈ వ్యక్తులు, శక్తుల దుష్ప్రచారం కారణంగా ప్రజల్లో ఆందోళన మొదలైంది. అవసరం లేకున్నా ఏటీఎంల ముందు గంటలు, రోజుల తరబడి క్యూలు కట్టించారు.. ఫలితంగా బ్యాంకుల్లో కరెన్సీ చెలామనికి ఇబ్బందులు కలిపించారు..
నిజానికి పెద్దనోట్ల రద్దువల్ల సామాన్యుని పెద్దగా ఇబ్బంది వచ్చింది ఏమీ లేదు.. పెద్ద ఎత్తున నగదు నిల్వలు ఉన్నవారే కష్టాలకు గురయ్యారు.. అది సహజం..
ఒక సాహసోపేతమైన భారీ కార్యక్రమం చేపట్టినప్పుడు ఫలితాలు అంత తొందరగా కనిపిస్తాయని ఆశించడం మూర్ఖత్వం.. ఉదాహరణకు మనం ఏదైనా వ్యాపారం మొదలు పెట్టగానే తక్షణ లాభాలు వచ్చేస్తాయా?.. ప్రమాదానికి గురైన రోగి చికిత్స జరిగిన వెంటనే లేచి పరుగెడతాడా?.. కొన్ని వారాలు, నెలలు కూడా పట్టవచ్చు.. మరి దశాబ్దాలుగా రోగగ్రస్థమైన దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగే చికిత్సకు ఇంత తక్కువ వ్యవధిలో జడ్జిమెంట్ అవసరమా?..
ఒక చారిత్రాత్మక నిర్ణయానికి దేశ ప్రజలమంతా అండగా ఉందాం.. నల్లధనంపై పోరులో మనవంతు పాత్రను విజయవంతం చేద్దాం.. జై స్వచ్ఛ్ భారత్..