మహాశివరాత్రికి
ఎంతో ప్రాధాన్యత ఉంది.. త్రిమూర్తుల్లో ఒకరు, లయకారుడై పరమ శివుడు ఈ రోజే
జన్మించాడని శివ పురాణం చెబుతోంది.. ఏటా మాఘ బహుళ
చతుర్దశి నాడు వచ్చే
మహాశివరాత్రి హిందువులకు అత్యంత పర్వదినం. శివరాత్రి రోజున
తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి
రోజంతా ఉపవాసం ఉంటారు.. రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు.
శివరాత్రి నాడు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, మన రాష్ట్రంలోని పంచారామాలు, శైవ
క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకములు,
అర్చనలు,
శివలీలా కథాపారాయణలు జరుపుతారు..
అందరికీ
మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు..
No comments:
Post a Comment