మన దేశం స్వతంత్రం సాధించిన తర్వాత ఎన్నడూ ఇంతటి దౌర్భాగ్య విదేశాంగ విధానాన్ని చూసి ఉండక పోవచ్చు.. పాకిస్తాన్ సైన్యం బరి తెగించి ఇద్దరు భారతీయ సైనికులను పాశవికంగా చంపినా యు.పి.ఎ. పాలకుల్లో కనీస చలనం లేదు.. నామ మాత్రపు నిరసన తెలిపి ఊరుకుంది.. బహుశ ప్రపంచ దేశాలు మనను చూసి నవ్వుకొని ఉండ వచ్చు.. ప్రతి భారతీయుడు సిగ్గుతో తల వంచుకోవాల్సిన దుస్థితి ఇది..
పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని రెచ్చ గొడుతున్నా చేతులు ముడుచు కుంటున్నాం.. కసబ్ ను రహస్యంగా ఉరి తీసి చంకలు గుడ్డుకుంటున్నాం.. కాని పార్లమెంట్ పై దాడి కుట్ర దారుడైన అఫ్జల్ గురును ఉరి తీయడానికి ధైర్యం చాలడం లేదు.. అసలు ఈ దుస్థితి అంతటికీ కారణం జవహర్ లాల్ నెహ్రు.. కాశ్మీర్ సమస్య విషయంలో అయన వేసిన తప్పటడుగుల ఫలితాన్ని ఇప్పుడు భారత దేశం అనుభవిస్తోంది.. కాశ్మీర్ సమస్యను ఐక్య రాజ్య సమితికి తీసుకెల్లడం ద్వారా శాంతి కాముడిగా పేరు తెచ్చుకుందామని ఆశ పడ్డారాయన.. టిబెట్ ను చైనా ఆక్రమించడాన్ని గుడ్డిగా సమర్దించారు. హిందీ-చీని భాయి భాయి అంటూ మురిశారు.. తీరా చైనా మనపై దాడి చేశాక గాని నెహ్రు గారి భ్రమలు తొలగలేదు.. కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లలో చాల భాగాలు పాకిస్తాన్, చైనా ఆక్రమణలో ఉన్నా గట్టిగా ప్రశ్నించాలేక పోతున్నాం..
జనాభా పరంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. కాని అరవై ఏళ్లుగా సరైన విదేశాంగ విధానాన్ని రూపొందించుకో లేక పోయాం.. ఒకప్పుడు మన దేశంపై ఆధార పడ్డ శ్రీలంక, మాల్దీవులు క్రమంగా చైనా ఒడిలోకి పోతున్నాయి.. బంగ్లాదేశ్, నేపాల్, బర్మా కూడా చైనా వైపే చూస్తున్నాయి..
ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ మనకెందుకులే అనుకోకండి.. దేశ భద్రత గురుంచి ఆలోచించడం, ప్రశ్నించడం భారతీయులుగా మన అందరి విధి.. మొన్నటికి మొన్న సాముహిక అత్యాచార సంఘటనపై యువత వీధుల్లోకి వచ్చి గట్టిగా నిలదీస్తే ప్రభుత్వం దిగి వచ్చింది.. దేశ భద్రత విషయంలో కూడా అలాగే ప్రభుత్వ మెడలు వంచలేమా? ఆలోచించండి..

No comments:
Post a Comment