Friday, October 7, 2016

దేశం పట్ల విధేయత ఇలాగేనా?

మన దేశంలో కొందరు నాయకులు, సెలబ్రిటీలు, మేతావులను చూస్తుంటే వీరు భారతీయులేనా అనే అనుమానం కన్నా, అసలు మనుషులేనా అనిపిస్తుంది.. వీరు తినేది అన్నమేనా అని కడిగేయాలనిపిస్తుంది.. అడ్డ గాడిదలు అని తిట్టాలనుకున్నా, వీరి కన్నా ఆ గాడిదలే నయం అని సరిపెట్టుకుంటున్నాను..
ఈ దేశంలో పుట్టి, ఇక్కడే పెరుగుతూ, ఇక్కడి తిండి, నీరు, గాలితో తెగ బలిసిపోయారు.. కండ కావరమెక్కి, మతి లేకుండా మాట్లాడుతున్నారు.. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే రకం వెధవలు వీరు..  తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సార్వభమత్వాన్ని, సరిహద్దులను కాపాడుతున్న వీర జవాన్ల త్యాగాలను తక్కువ చేస్తూ, నోటికి ఏది తోచితే అది మాట్లాడే వీరిని ఏమి చేసినా తప్పులేదు..  చెప్పు దెబ్బలు, కొరడా దెబ్బలతో సత్కరిస్తూ, నడి రోడ్డులో ఉరి తీయాలనేంత కోపం వస్తోంది..
ఉరీ సెక్టార్ పై ఉగ్రవాదుల దాడి తర్వాత మన వీర జవాన్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ స్ట్రయిక్ జరిపి 40 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టారు.. దేశ ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు.. దాదాపు ప్రపంచ దేశాలన్నీ భారత్ చర్యను సమర్ధించాయి.. ఆత్మ గౌరవం ఉన్న ఏ దేశమైనా చేసే పని ఇదే.. రాజకీయాలకు అతీతంగా పార్టీలు, ప్రజలు ఏకతాటిపై నిలిచి ప్రభుత్వం తీసుకున్న చర్యను స్వాగతించారు..  ఇదే సమయంలో కొందరి నోట పాకీ పాటలు (పాకిస్థాన్ భాష) వినిపిస్తున్నాయి.. అసలు సర్జికల్ స్ట్రయిక్ జరిగిందా? అని ఒకడు ప్రశ్నిస్తే, ఆధారాలు చూపించాలంటాడు మరొకడు.. గతంలో మేమూ ఇలాగే చేశాం కానీ ప్రచారం చేసుకోలేదని సన్నాయి నొక్కలు నొక్కుతాడు ఇంకోడు.. తమ నీఛ రాజకీయాల కోసం దేశ ప్రయోజనాలను విస్మరించి మతి లేకుండా మాట్లాడుతున్న వీరిని పాకిస్థాన్ మీడియా కీర్తిస్తోందట..
రాజకీయ నాయకుల సంగతి ఇలా ఉంటే, ఊరంతా ఒకదారి అయితే ఉలిపిరి కట్టది మరోదారి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు కొందరు సెలబ్రిటీలు, మేతావులు.. కళాకారులకు సరిహద్దులు ఉండవంటూ వగలు పోతున్నారు.. పాకిస్థానీ కళాకారులను నిషేధించడం తగదంటూ చిలక పలుకులు పలుకుతున్నారు.. సింధూ నది జలాల విషయంలో కూడా పొరుగు దేశం పాట పాడుతున్నారు..
పార్లమెంటుపై దాడి చేసిన వారిని, ముంబైలో మారణ హోమం సృష్టించి అమాయక ప్రజలను హతమార్చినవారిని ఉరి తీస్తే తప్పు పడుతూ కొవ్వొత్తు వెలిగించి నిరసన ప్రదర్శనలు జరిపిన వారు, దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లను గౌరవిస్తారని ఆశించడం మనదే తప్పు..
చివరగా నాదొక్కటే మనవి మీకు పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లి చావండి.. ఇక్కేడే ఉంటూ కోట్లాది మంది ప్రజల మనోభావాలను కించ పరుస్తూ మాట్లాడతామంటే అది కుదరని పని.. ఈ దేశం ఉప్పుతింటూ నమ్మక ద్రోహం చేస్తామంటే ఎవరూ ఊరుకోరు..
సైనికులు శత్రువుల నుండి దేశ ప్రజలను కాపాడతారు.. రైతులు తమ పంటలకు సోకే చీడ పురుగులను నిర్మూలిస్తాడు.. కానీ అంతర్గత శత్రువుల సంగతి ఏమిటి?.. ప్రజలే ఇలాంటి వారిని ఏరేయాలి.. (05.10.2016)

No comments:

Post a Comment