Sunday, October 2, 2016

గట్టివాడు మన శాస్త్రీజీ..

‘జై జవాన్.. జై కిసాన్..’ ఎంత గొప్ప నినాదం ఇది.. దేశ సరిహద్దులను కాపాడే సైనికున్ని, అన్నం పెట్టే రైతన్నకు జై కొడుతూ ఇచ్చిన నినాదం.. ఈ నినాదం వినగానే ద్వితీయ ప్రధానమంత్రి లాల్ బహద్దూర్ శాస్త్రి గుర్తురాక మానరు..
చైనాతో జరిగిన యుద్దంలో పరాజయం తర్వాత జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం మన దేశం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. ఇలాంటి సమయంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి.. ఇంతలోనే పాకిస్థాన్ తో మళ్లీ యుద్దం వచ్చింది.. శాస్త్రీజీ ఇచ్చిన స్పూర్తితో మన వీర జవానులు ఆ దేశాన్ని తక్కుగా ఓడించారు.. దేశం విజయగర్వంతో మళ్లీ తలెత్తుకుంది..
ఈ యుద్దం తర్వాత సోవియట్ యూనియన్ లోని తాష్కెంట్ లో భారత్, పాకిస్తాన్ ల మధ్య శిఖరాగ్ర చర్చలు జరిగాయి.. ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రి, పాక్ నియంత అయూబ్ ఖాన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.. అదే రోజు రాత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో దివంగతులయ్యారు శాస్త్రీజీ.. 
నీతి, నిజాయితి నిరాడంబరతలకు ప్రతిరూపంగా నిలిచిన మహోన్నత వ్యక్తి లాల్ బహద్దూర్ శాస్త్రి.. ఆయన దేశానికి చాలా తక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్నారు.. కానీ ప్రజల హృదయాల్లో తనదైన చెరగని ముద్ర వేశారు.. పొట్టి వాడైనా గట్టివాడినని నిరూపించుకున్నారు..  శాస్త్రీజీ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో నల్లగొండ జిల్లాలో ఒక రైలు ప్రమాదం జరిగింది.. ప్రయాణీకులకు భద్రత కల్పించడంలో విఫలం అయ్యాననే పశ్చాతాపంతో నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేశారాయన..
మహాత్మాగాంధీ సిద్దాంతాలను ఆచరించి చూపించారు లాల్ బహద్దూర్ శాస్త్రీజీ.. గాంధీజీ జన్మదినం రోజునే శాస్త్రీజీకూడా పుట్టారు..  ‘జై జవాన్.. జై కిసాన్..’ నినాదం ఇచ్చిన ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పిద్దాం.. (అక్టోబర్ 2, 1904 లాల్ బహద్దూర్ శాస్త్రి జయంతి)

No comments:

Post a Comment