Saturday, October 1, 2016

పాకిస్థాన్ కాలగర్భంలో కలుస్తుందా?

పాకిస్థాన్ భ‌విష్య‌త్తు ఏమిటి?.. ఇప్ప‌డు అంద‌రి ముందున్న ప్ర‌శ్న ఇది.. దీనికి స‌రైన స‌మాధానం ఏమిటంటే?.. స‌మీప భ‌విష్య‌త్తులో ఆ దేశం త‌న‌ ఉనికిని, ఎల్ల‌ల‌నూ కోల్పోనుంది.. ఇది స్వ‌ప్నం కాదు.. వాస్త‌వం..
పాకిస్థాన్ మ‌తం ఆధారంగా ఏర్ప‌డిన దేశం.. బ్రిటిష్ వారు పోతూ, పోతూ భార‌తదేశాన్ని విడ‌గొట్టి పాకిస్థాన్‌ను ఏర్పాటు చేశారు.. ఆ దేశానికి సొంత చ‌రిత్ర లేదు.. భార‌త దేశ చ‌రిత్రే వారి చ‌రిత్ర‌.. కానీ ఈ చ‌రిత్ర‌ను వారు త‌మ పిల్ల‌ల‌కు బోధించ‌రు.. ఎందుకంటే దేశ‌ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల‌ను గుర్తు చేసుకోవ‌డం ఆ దేశ పాల‌కుల‌కు ఇష్టం ఉండ‌దు..


త‌మ సంస్కృతిక వార‌స‌త్వాన్ని మ‌ర‌చిపోవ‌డ‌మే పాకిస్థాన్ చేసుకున్న పెద్ద త‌ప్పిదం.. కేవ‌లం మ‌తం ఆధారంగా ఏర్ప‌డ్డా, ఆ భావ‌న వారిని ఒక‌టిగా ఉంచ‌లేక‌పోతోంది.. ఆ దేశంలో అంద‌రూ ముస్లింలే, అయినా నిత్యం కొట్టుకు చ‌స్తారు.. వ‌ర్గాలు, తెగ‌ల కుంప‌టిలో నిత్యం అశాంతితో ర‌గులిపోతోంది పాకిస్థాన్‌..
పాకిస్థాన్ అధికార భాష ఉర్ధూ.. విచిత్రం ఏమిటంటే ఉర్దూ మాట్లాడేవారు భార‌త దేశంలోనే అధికం.. పాకిస్థాన్‌లో ఏ ఒక్క‌రి మాతృభాష ఉర్దూ కాదు.. అక్కడ పంజాబీ, సిందీ, బ‌లూచి, ప‌ష్తో భాష‌లు మాట్లాడేవారు ఎక్కువ‌.. ఇవే కాకుండా స్థానికంగా అనేక భాష‌లు ఉనికిలో ఉన్నాయి.. ఉర్ధూ భాష‌ను బ‌ల‌వంతంగా రుద్దేందుకు పాకిస్థాన్ పాల‌కులు చేసిన ప్ర‌య‌త్నాలు బెడిసికొట్టాయి.. ఫ‌లితంగా 1971లో తూర్పు పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్ ఆవిర్భ‌వించింది.. అయినా పాక్ పాల‌కుల‌కు బుద్ది రాలేదు.. స్థానిక భాష‌లు, తెగ‌లు, సంస్కృతుల‌ను కాల‌రాచేందుకు నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తుంటారు..
అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోలేని దుస్థితిలో ఉన్న  పాకిస్థాన్, త‌మ దేశ ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకు కశ్మీర్ స‌మ‌స్య‌ను ర‌గిలిస్తోంది.. మూడో వంతు క‌శ్మీర్ ను ఆక్ర‌మించుకొని అక్క‌డి ప్ర‌జ‌ల‌ను చిత్ర హింస‌ల‌కు గురి చేస్తోంది.. ఆక్ర‌మిత కాశ్మీర్ (గిల్గిత్-బాల్టిస్థాన్‌) మొత్తాన్ని వ‌ల‌స‌ల‌తో నింపేసింది.  అక్కడ ప్రజాస్వామ్యం అనేదే కనిపించదు.. మ‌రోవైపు క‌శ్మీర్‌లో వేర్పాటు వాదులను ప్రోత్స‌హిస్తోంది.. భార‌త దేశంలోకి ఉగ్ర‌వాదుల‌ను పంపి దాడులను జ‌రిపిస్తోంది.. మ‌న దేశంలో జ‌రిగిన అన్ని ఉగ్ర‌వాద ఘ‌ట‌న‌ల్లో పాకిస్థాన్ ప్ర‌మేయం స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా, త‌మ‌కేమీ తెలియ‌ద‌ని బుఖాయించ‌డం పాకిస్థాన్ పాల‌కుల‌కు అల‌వాటైపోయింది..
ఇంత కాలం ఓర్పుతో వ్య‌వ‌హ‌రించిన బార‌త్ ఇప్పుడు పాకిస్థాన్‌కు వారి ప‌ద్ద‌తిలోనే బుద్ధి చెప్ప‌డానికి సిద్ద‌మైంది.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బ‌లూచిస్తాన్ వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్థావించ‌డంతో ఇర‌కాటంలో ప‌డిపోయిన పాక్‌.. దిక్కు తోచ‌ని స్థితిలో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు, స‌రిహ‌ద్దుల్లో కాల్పుల‌ను ముమ్మ‌రం చేసింది.. ఉరీ ఘ‌ట‌న త‌ర్వాత భార‌త సైన్యం అంతే ధీటుగా పాకిస్థాన్‌కు స‌మాధానం చెప్పింది..
1947
లో ఏర్ప‌డిన పాకిస్థాన్‌, 1971లో బంగ్దాదేశ్ (తూర్పు పాకిస్థాన్‌)ను కోల్పోయింది.. ఇక బ‌లూచిస్థాన్ ప్రావిన్స్  కూడా ఆ దేశం నుండి విడిపోయేందుకు సిద్ద‌మ‌వుతోంది.. సింధ్ ప్రావిన్స్‌లో సింధ్ దేశ్ కోసం పోరాటం జ‌రుగుతోంది.. అటు వాయువ్య స‌రిహ‌ద్దు ప్రావిన్స్‌లో గిరిజ‌న తెగ‌లు ప‌క్తూనిస్థాన్ కోసం ఎప్ప‌టి నుండో పోరాడుతున్నారు.. చివ‌ర‌కు పాకిస్థాన్ దేశం పంజాబ్ ప్రావిన్స్ (ప‌శ్చిమ పంజాబ్‌)కే ప‌రిమితం కానుందా?
'
వినాశకాలే విప‌రీత బుద్ది..' చెర‌ప‌కురా చెడేవు..' అన్నారు మ‌న పెద్ద‌లు.. పాకిస్థాన్ చేస్తున్న ప‌ని ఇదే.. త‌న గోరీని తానే త‌వ్వుకుంటోంది ఆ దేశం..

No comments:

Post a Comment