Sunday, October 2, 2016

శాస్త్రీజీ ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి..

లాల్ బహద్దూర్ శాస్త్రి మరి కొంత కాలం దేశ ప్రధానమంత్రిగా కొనసాగి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో ఊహించుకొండి.. 

*సోకాల్డ్ గాంధీ-నెహ్రూ వంశ పారంపర్య పాలనకు జీజం పడి ఉండేది కాదు..
*శాస్త్రీజీ క్యాబినెట్లో సమాచార శాఖ మంత్రిగా పని చేస్తున నెహ్రూ తనయ ఇందిరాగాంధీకీ మరింత కీలకమైన పదవి ఇచ్చేవారు..
*ఇందిరా గాంధీ పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ ఎయిరిండియా పైలెట్ గా రిటైర్ అయ్యి *ఉండేవాడు.. ఆ తర్వాత తనకు ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీ హ్యాబీని కొనసాగించేవాడు..
*ఇక చదువులో అంతగా రాణించని దుందుడుకు స్వభావం గల ఇందిర రెండో కొడుకు సంజయ్ గాంధీ బహుషా విఫల పారిశ్రామికవేత్తగా మిగిలి ఉండేవారు.. కాంగ్రెస్ పార్టీలో ఒక మొస్తారు పదవి కోసం ప్రయత్నాలు చేసి ఉండేవారు..
దురదృష్టవశాత్తు లాల్ బహద్దూర్ శాస్త్రీ అకాల మరణంతో కాంగ్రెస్ లో ప్రధాని పదవి కోసం అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి.. కొందరు పెద్దలు రాజీ మార్గంగా ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేశారు.. ఆమెను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో చక్రం తిప్పాలను కలలు కన్నారు..
వీరందరి ఆశలను వమ్ము చేస్తూ ఏకు మేకుగా మారింది ఇందిరా గాంధీ.. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకుంది.. క్రమంగా తన తనయులను పార్టీలోకి తెచ్చి వంశపారంపర్య పాలనకు తెరలేపింది.. ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే..
జవహర్ లాల్ నెహ్రూ మరణం తర్వాత దేశం కిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రీ.. చైనా యుద్ద పరాజయ అవమానం, ఆహార సమస్య దేశాన్ని పీడిస్తున్నాయి.. ప్రధాని శాస్త్రీజీ దేశంలో హరిత విప్లవానికి నాంది పలికి రైతన్నలను అధిక ఆహార ఉత్పత్తి దిశగా ప్రోత్సహించారు..
ఇంతలో పాకిస్థాన్ తో యుద్దం వచ్చిపడింది.. లాల్ బహద్దూర్ శాస్త్రి దిశా నిర్దేశ్యంతో భారత సైన్యం ఘన విజయం సాధించింది..  దేశమంతా ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.. ‘శాస్త్రీజీ ఇచ్చిన జై జవాన్.. జై కిసాన్..’ నినాదం ఒక మంత్రంలా పని చేసింది..
తాష్కెంట్ లో భారత్- పాకిస్తాన్ ల మధ్య ఒప్పందం జరిగిన రాత్రే అనుమానాస్పద పరిస్థితుల్లో కన్ను మూశారు శాస్త్రీజీ.. ఈ ఘటనపై సరైన విచారణ కూడా జరగలేదు..
లాల్ బహద్దూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా పని చేసింది కొద్ది కాలమే అయినా నీతి నిజాయితీ, పారదర్శక పాలన, వ్యక్తిత్వాలతో దేశ ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించారు.. ఆయన ఇంకా కొంత కాలం బతికే ఉంటే భారత దేశ చరిత్ర మరోలా ఉండేది..

No comments:

Post a Comment