Monday, October 3, 2016

భువన గజరాజం

తెలంగాణలోని కీలకమైన దుర్గాల్లో భువనగిరి ముఖ్యమైనది.. పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన ఆరవ త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు అతి పెద్ద ఏకశిలా పర్వతం మీద త్రిభువనగిరి కోటను నిర్మించాడు.. త్రిభువనగిరి కాస్తా భువనగిరిగా ప్రసిద్ధి పొందింది.. కాకతీయుల కాలంలో వైభవం సంతరించుకున్న భువనగిరి కుతుబ్ షాహులు, అసఫ్ జాహీల కాలానికి వచ్చే సరికి వాడుకలో భోనగిరిగా మారిపోయింది..
హైదరాబాద్ నుండి 47 కిలో మీటర్ల దూరంలో ఉన్న భువనగిరి దుర్గం ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో ఉంది.. కొద్ది రోజుల్లో యాదాద్రి జిల్లాలో భాగం కానుంది.. భువనగిరి కోట అందాలను కనులారా చూసి తీరాల్సిందే తప్ప వర్ణించలేం.
భువనగిరి కోట కొండ పడమటి దిక్కు నుండి నిద్రిస్తున్న ఏనుగులా కనిపిస్తుంది.. దక్షిణం వైపు నుండి తాబేలులా అగుపిస్తుంది.. హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లుతుండగా 163వ జాతీయ రహదారి పక్కన కనిపించిన నిద్రిస్తున్న ఈ గజరాజును నా మొబైల్ ఫోన్లో బంధించాను.. మీరు చూస్తున్న చిత్రం అదే..

No comments:

Post a Comment