Monday, October 31, 2016
భారత జాతిని ఐక్య పరిచిన ఉక్కుమనిషి
Sunday, October 30, 2016
Saturday, October 29, 2016
జాగ్రత్తలు పాటించండి.. ఆనందంగా దీపావళి జరుపుకోండి..
Sunday, October 23, 2016
టపాకాయల బహిష్కరణ చైనాకు చెంప పెట్టు కావాలి
Sunday, October 16, 2016
ఇంతకీ జిల్లాలు ఎన్ని?
కొత్త జిల్లాల సందడి..
మా పూర్వీకుల ఊరు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటే, నేను పుట్టింది హైదరాబాద్, ఉంటున్నది రంగారెడ్డి జిల్లా.. నీది ఏ జిల్లా అని ఎవరైనా అడిగితే, వివరణ ఇచ్చుకోలేక ఇబ్బంది పడేవాన్ని.. ఇప్పుడా ఇబ్బంది తప్పింది నాకు.. నేను రావడం లేదని ఊరు బెంగ పెట్టుకున్నదేమా?.. ఏకంగా నేనుంటున్న జిల్లాలో కలిసిపోయింది.. షాద్ నగర్ నియోజకవర్గం, కొత్తూరు మండలం, పెంజర్ల గ్రామం ఇప్పుడు రంగారెడ్డిలోకి వచ్చేశాయి..
ఇప్పుడు నేను రంగారెడ్డి అని చెప్పుకుంటానేమో.. కానీ మళ్లీ గందరగోలమే.. పాలనా పరంగా మాది గ్రేటర్ హైదరాబాద్.. మళ్లీ గందరగోలమే.. నేనిప్పుడు బాధ పడుతున్నది పాలమూరోడిని అని చెప్పుకునే అర్హత కోల్పోయానని.. కృష్ణా, తుంగభద్ర నదులకు, నల్లమల అడవులకు దూరమయ్యానని.. అఫ్ కోర్స్ మహబూబ్ నగర్ జిల్లా కూడా వాటిని కోల్పోయింది.. మన పెద్దలంటారు అన్నీ మనవేనని అనుకోవద్దు.. కొన్ని సాధించాలంటే, కొన్నింటిని కోల్పోవాలి.. ఏదేమైనా పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను స్వాగతిద్దాం..
Tuesday, October 11, 2016
చరిత్రలో తెలంగాణ పునర్వ్యవస్థీకరణలు ఎన్నో..
తెలంగాణలోని ప్రస్తుత గ్రామాల సంఖ్య 10,966.. రాష్ట్రం మొత్తం విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ.. మొత్తం జనాభా 3,50,03,674 మంది..
పరిపాలనా సౌలభ్యం కోసం జరిగిన పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు కొత్తేం కాదు.. చరిత్రలో ఇలాంటి చాలా మార్పులను గమనించవచ్చు..
మౌర్యులు, శాతవాహనులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, రాష్ట్ర కూటులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల కాలం నుండి ఇలాంటి మార్పులు ఎన్నో జరిగాయి.. అసఫ్ జాహీ (నిజామ్) పాలకుల కాలం నుండి చరిత్రను గమనిస్తే..
అప్పట్లో హైదరాబాద్ స్టేట్ ను మొదటి పేరు ‘దక్కన్ సుభా’ అందులో నాలుగు డివిజన్లు, 16 జిల్లాలు.. తెలుగు ప్రాంతాలు గుల్షానాబాద్ డివిజన్, వరంగల్ డివిజన్ల కింద ఉండేవి..
గుల్షానాబాద్ డివిజన్లో ఆత్రాప్ బల్దా (హైదరాబాద్) మెదక్, మహబాబ్ నగర్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలు, వరంగల్ డివిజన్లో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను ఏర్పాటు చేశారు..
1948తో హైదరాబాద్ స్టేట్ భారత దేశంలో విలీనం అయింది.. ఆ తర్వాత 1953లో వరంగల్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా ఏర్పాటు చేశారు.. 1956లో హైదరాబాద్ స్టేట్ లోని తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.. 1978లో హైదరాబాద్ నుండి గ్రామీణ ప్రాంతాన్ని విడదీసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేశారు.. 1985లో తాలూకాల స్థానంలో మండల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది..
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.. 2016 దసరా రోజున తెలంగాణలో కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేశారు..
తెలంగాణలోని ప్రస్తుత జిల్లాలు: ఆదిలాబాద్, కొమురం భీం (ఆసిఫాబాద్), నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, వరంగల్ రూరల్, జయశంకర్ (భూపాలపల్లి), మహబూబా బాద్, జనగామ, ఖమ్మం, భద్రాద్రి (కొత్తగూడెం), మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ (గద్వాల)..
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో వివాదాలు ఎన్ని ఉన్నా, పరిపాలనా సౌలభ్యం కోసం స్వాగతించాల్సిన అవసరం ఉంది.. కొత్త జిల్లాల ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణ జరిగి, ప్రజలకు పరిపాలనా సౌకర్యాలు మరింత చేరువ కావాలని ఆశిద్దాం.
Sunday, October 9, 2016
తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక బతుకమ్మ
దేశ భద్రత విషయంలో ఈ లొల్లి ఏమిటి?
Friday, October 7, 2016
దేశం పట్ల విధేయత ఇలాగేనా?
ఈ దేశంలో పుట్టి, ఇక్కడే పెరుగుతూ, ఇక్కడి తిండి, నీరు, గాలితో తెగ బలిసిపోయారు.. కండ కావరమెక్కి, మతి లేకుండా మాట్లాడుతున్నారు.. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే రకం వెధవలు వీరు.. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సార్వభమత్వాన్ని, సరిహద్దులను కాపాడుతున్న వీర జవాన్ల త్యాగాలను తక్కువ చేస్తూ, నోటికి ఏది తోచితే అది మాట్లాడే వీరిని ఏమి చేసినా తప్పులేదు.. చెప్పు దెబ్బలు, కొరడా దెబ్బలతో సత్కరిస్తూ, నడి రోడ్డులో ఉరి తీయాలనేంత కోపం వస్తోంది..
ఉరీ సెక్టార్ పై ఉగ్రవాదుల దాడి తర్వాత మన వీర జవాన్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ స్ట్రయిక్ జరిపి 40 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టారు.. దేశ ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు.. దాదాపు ప్రపంచ దేశాలన్నీ భారత్ చర్యను సమర్ధించాయి.. ఆత్మ గౌరవం ఉన్న ఏ దేశమైనా చేసే పని ఇదే.. రాజకీయాలకు అతీతంగా పార్టీలు, ప్రజలు ఏకతాటిపై నిలిచి ప్రభుత్వం తీసుకున్న చర్యను స్వాగతించారు.. ఇదే సమయంలో కొందరి నోట పాకీ పాటలు (పాకిస్థాన్ భాష) వినిపిస్తున్నాయి.. అసలు సర్జికల్ స్ట్రయిక్ జరిగిందా? అని ఒకడు ప్రశ్నిస్తే, ఆధారాలు చూపించాలంటాడు మరొకడు.. గతంలో మేమూ ఇలాగే చేశాం కానీ ప్రచారం చేసుకోలేదని సన్నాయి నొక్కలు నొక్కుతాడు ఇంకోడు.. తమ నీఛ రాజకీయాల కోసం దేశ ప్రయోజనాలను విస్మరించి మతి లేకుండా మాట్లాడుతున్న వీరిని పాకిస్థాన్ మీడియా కీర్తిస్తోందట..
రాజకీయ నాయకుల సంగతి ఇలా ఉంటే, ఊరంతా ఒకదారి అయితే ఉలిపిరి కట్టది మరోదారి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు కొందరు సెలబ్రిటీలు, మేతావులు.. కళాకారులకు సరిహద్దులు ఉండవంటూ వగలు పోతున్నారు.. పాకిస్థానీ కళాకారులను నిషేధించడం తగదంటూ చిలక పలుకులు పలుకుతున్నారు.. సింధూ నది జలాల విషయంలో కూడా పొరుగు దేశం పాట పాడుతున్నారు..
పార్లమెంటుపై దాడి చేసిన వారిని, ముంబైలో మారణ హోమం సృష్టించి అమాయక ప్రజలను హతమార్చినవారిని ఉరి తీస్తే తప్పు పడుతూ కొవ్వొత్తు వెలిగించి నిరసన ప్రదర్శనలు జరిపిన వారు, దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లను గౌరవిస్తారని ఆశించడం మనదే తప్పు..
చివరగా నాదొక్కటే మనవి మీకు పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లి చావండి.. ఇక్కేడే ఉంటూ కోట్లాది మంది ప్రజల మనోభావాలను కించ పరుస్తూ మాట్లాడతామంటే అది కుదరని పని.. ఈ దేశం ఉప్పుతింటూ నమ్మక ద్రోహం చేస్తామంటే ఎవరూ ఊరుకోరు..
సైనికులు శత్రువుల నుండి దేశ ప్రజలను కాపాడతారు.. రైతులు తమ పంటలకు సోకే చీడ పురుగులను నిర్మూలిస్తాడు.. కానీ అంతర్గత శత్రువుల సంగతి ఏమిటి?.. ప్రజలే ఇలాంటి వారిని ఏరేయాలి.. (05.10.2016)
Monday, October 3, 2016
భువన గజరాజం
హైదరాబాద్ నుండి 47 కిలో మీటర్ల దూరంలో ఉన్న భువనగిరి దుర్గం ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో ఉంది.. కొద్ది రోజుల్లో యాదాద్రి జిల్లాలో భాగం కానుంది.. భువనగిరి కోట అందాలను కనులారా చూసి తీరాల్సిందే తప్ప వర్ణించలేం.
భువనగిరి కోట కొండ పడమటి దిక్కు నుండి నిద్రిస్తున్న ఏనుగులా కనిపిస్తుంది.. దక్షిణం వైపు నుండి తాబేలులా అగుపిస్తుంది.. హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లుతుండగా 163వ జాతీయ రహదారి పక్కన కనిపించిన నిద్రిస్తున్న ఈ గజరాజును నా మొబైల్ ఫోన్లో బంధించాను.. మీరు చూస్తున్న చిత్రం అదే..
Sunday, October 2, 2016
శాస్త్రీజీ ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి..
*సోకాల్డ్ గాంధీ-నెహ్రూ వంశ పారంపర్య పాలనకు జీజం పడి ఉండేది కాదు..
*శాస్త్రీజీ క్యాబినెట్లో సమాచార శాఖ మంత్రిగా పని చేస్తున నెహ్రూ తనయ ఇందిరాగాంధీకీ మరింత కీలకమైన పదవి ఇచ్చేవారు..
*ఇందిరా గాంధీ పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ ఎయిరిండియా పైలెట్ గా రిటైర్ అయ్యి *ఉండేవాడు.. ఆ తర్వాత తనకు ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీ హ్యాబీని కొనసాగించేవాడు..
*ఇక చదువులో అంతగా రాణించని దుందుడుకు స్వభావం గల ఇందిర రెండో కొడుకు సంజయ్ గాంధీ బహుషా విఫల పారిశ్రామికవేత్తగా మిగిలి ఉండేవారు.. కాంగ్రెస్ పార్టీలో ఒక మొస్తారు పదవి కోసం ప్రయత్నాలు చేసి ఉండేవారు..
దురదృష్టవశాత్తు లాల్ బహద్దూర్ శాస్త్రీ అకాల మరణంతో కాంగ్రెస్ లో ప్రధాని పదవి కోసం అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి.. కొందరు పెద్దలు రాజీ మార్గంగా ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేశారు.. ఆమెను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో చక్రం తిప్పాలను కలలు కన్నారు..
వీరందరి ఆశలను వమ్ము చేస్తూ ఏకు మేకుగా మారింది ఇందిరా గాంధీ.. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకుంది.. క్రమంగా తన తనయులను పార్టీలోకి తెచ్చి వంశపారంపర్య పాలనకు తెరలేపింది.. ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే..
జవహర్ లాల్ నెహ్రూ మరణం తర్వాత దేశం కిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రీ.. చైనా యుద్ద పరాజయ అవమానం, ఆహార సమస్య దేశాన్ని పీడిస్తున్నాయి.. ప్రధాని శాస్త్రీజీ దేశంలో హరిత విప్లవానికి నాంది పలికి రైతన్నలను అధిక ఆహార ఉత్పత్తి దిశగా ప్రోత్సహించారు..
ఇంతలో పాకిస్థాన్ తో యుద్దం వచ్చిపడింది.. లాల్ బహద్దూర్ శాస్త్రి దిశా నిర్దేశ్యంతో భారత సైన్యం ఘన విజయం సాధించింది.. దేశమంతా ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.. ‘శాస్త్రీజీ ఇచ్చిన జై జవాన్.. జై కిసాన్..’ నినాదం ఒక మంత్రంలా పని చేసింది..
తాష్కెంట్ లో భారత్- పాకిస్తాన్ ల మధ్య ఒప్పందం జరిగిన రాత్రే అనుమానాస్పద పరిస్థితుల్లో కన్ను మూశారు శాస్త్రీజీ.. ఈ ఘటనపై సరైన విచారణ కూడా జరగలేదు..
లాల్ బహద్దూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా పని చేసింది కొద్ది కాలమే అయినా నీతి నిజాయితీ, పారదర్శక పాలన, వ్యక్తిత్వాలతో దేశ ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించారు.. ఆయన ఇంకా కొంత కాలం బతికే ఉంటే భారత దేశ చరిత్ర మరోలా ఉండేది..
భారత దేశ మహా పుత్రుడు..
గట్టివాడు మన శాస్త్రీజీ..
‘జై జవాన్.. జై కిసాన్..’ ఎంత గొప్ప నినాదం ఇది.. దేశ సరిహద్దులను కాపాడే సైనికున్ని, అన్నం పెట్టే రైతన్నకు జై కొడుతూ ఇచ్చిన నినాదం.. ఈ నినాదం వినగానే ద్వితీయ ప్రధానమంత్రి లాల్ బహద్దూర్ శాస్త్రి గుర్తురాక మానరు..
చైనాతో జరిగిన యుద్దంలో పరాజయం తర్వాత జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం మన దేశం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. ఇలాంటి సమయంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి.. ఇంతలోనే పాకిస్థాన్ తో మళ్లీ యుద్దం వచ్చింది.. శాస్త్రీజీ ఇచ్చిన స్పూర్తితో మన వీర జవానులు ఆ దేశాన్ని తక్కుగా ఓడించారు.. దేశం విజయగర్వంతో మళ్లీ తలెత్తుకుంది..
ఈ యుద్దం తర్వాత సోవియట్ యూనియన్ లోని తాష్కెంట్ లో భారత్, పాకిస్తాన్ ల మధ్య శిఖరాగ్ర చర్చలు జరిగాయి.. ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రి, పాక్ నియంత అయూబ్ ఖాన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.. అదే రోజు రాత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో దివంగతులయ్యారు శాస్త్రీజీ..
నీతి, నిజాయితి నిరాడంబరతలకు ప్రతిరూపంగా నిలిచిన మహోన్నత వ్యక్తి లాల్ బహద్దూర్ శాస్త్రి.. ఆయన దేశానికి చాలా తక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్నారు.. కానీ ప్రజల హృదయాల్లో తనదైన చెరగని ముద్ర వేశారు.. పొట్టి వాడైనా గట్టివాడినని నిరూపించుకున్నారు.. శాస్త్రీజీ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో నల్లగొండ జిల్లాలో ఒక రైలు ప్రమాదం జరిగింది.. ప్రయాణీకులకు భద్రత కల్పించడంలో విఫలం అయ్యాననే పశ్చాతాపంతో నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేశారాయన..
మహాత్మాగాంధీ సిద్దాంతాలను ఆచరించి చూపించారు లాల్ బహద్దూర్ శాస్త్రీజీ.. గాంధీజీ జన్మదినం రోజునే శాస్త్రీజీకూడా పుట్టారు.. ‘జై జవాన్.. జై కిసాన్..’ నినాదం ఇచ్చిన ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పిద్దాం.. (అక్టోబర్ 2, 1904 లాల్ బహద్దూర్ శాస్త్రి జయంతి)
Saturday, October 1, 2016
పాకిస్థాన్ కాలగర్భంలో కలుస్తుందా?
పాకిస్థాన్ మతం ఆధారంగా ఏర్పడిన దేశం.. బ్రిటిష్ వారు పోతూ, పోతూ భారతదేశాన్ని విడగొట్టి పాకిస్థాన్‌ను ఏర్పాటు చేశారు.. ఆ దేశానికి సొంత చరిత్ర లేదు.. భారత దేశ చరిత్రే వారి చరిత్ర.. కానీ ఈ చరిత్రను వారు తమ పిల్లలకు బోధించరు.. ఎందుకంటే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులను గుర్తు చేసుకోవడం ఆ దేశ పాలకులకు ఇష్టం ఉండదు..
తమ సంస్కృతిక వారసత్వాన్ని మరచిపోవడమే పాకిస్థాన్ చేసుకున్న పెద్ద తప్పిదం.. కేవలం మతం ఆధారంగా ఏర్పడ్డా, ఆ భావన వారిని ఒకటిగా ఉంచలేకపోతోంది.. ఆ దేశంలో అందరూ ముస్లింలే, అయినా నిత్యం కొట్టుకు చస్తారు.. వర్గాలు, తెగల కుంపటిలో నిత్యం అశాంతితో రగులిపోతోంది పాకిస్థాన్..
పాకిస్థాన్ అధికార భాష ఉర్ధూ.. విచిత్రం ఏమిటంటే ఉర్దూ మాట్లాడేవారు భారత దేశంలోనే అధికం.. పాకిస్థాన్‌లో ఏ ఒక్కరి మాతృభాష ఉర్దూ కాదు.. అక్కడ పంజాబీ, సిందీ, బలూచి, పష్తో భాషలు మాట్లాడేవారు ఎక్కువ.. ఇవే కాకుండా స్థానికంగా అనేక భాషలు ఉనికిలో ఉన్నాయి.. ఉర్ధూ భాషను బలవంతంగా రుద్దేందుకు పాకిస్థాన్ పాలకులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.. ఫలితంగా 1971లో తూర్పు పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్ ఆవిర్భవించింది.. అయినా పాక్ పాలకులకు బుద్ది రాలేదు.. స్థానిక భాషలు, తెగలు, సంస్కృతులను కాలరాచేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు..
అంతర్గత సమస్యలను పరిష్కరించుకోలేని దుస్థితిలో ఉన్న పాకిస్థాన్, తమ దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు కశ్మీర్ సమస్యను రగిలిస్తోంది.. మూడో వంతు కశ్మీర్ ను ఆక్రమించుకొని అక్కడి ప్రజలను చిత్ర హింసలకు గురి చేస్తోంది.. ఆక్రమిత కాశ్మీర్ (గిల్గిత్-బాల్టిస్థాన్) మొత్తాన్ని వలసలతో నింపేసింది. అక్కడ ప్రజాస్వామ్యం అనేదే కనిపించదు.. మరోవైపు కశ్మీర్లో వేర్పాటు వాదులను ప్రోత్సహిస్తోంది.. భారత దేశంలోకి ఉగ్రవాదులను పంపి దాడులను జరిపిస్తోంది.. మన దేశంలో జరిగిన అన్ని ఉగ్రవాద ఘటనల్లో పాకిస్థాన్ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తున్నా, తమకేమీ తెలియదని బుఖాయించడం పాకిస్థాన్ పాలకులకు అలవాటైపోయింది..
ఇంత కాలం ఓర్పుతో వ్యవహరించిన బారత్ ఇప్పుడు పాకిస్థాన్‌కు వారి పద్దతిలోనే బుద్ధి చెప్పడానికి సిద్దమైంది.. ప్రధాని నరేంద్ర మోదీ బలూచిస్తాన్ వ్యవహారాన్ని ప్రస్థావించడంతో ఇరకాటంలో పడిపోయిన పాక్.. దిక్కు తోచని స్థితిలో ఉగ్రవాద కార్యకలాపాలు, సరిహద్దుల్లో కాల్పులను ముమ్మరం చేసింది.. ఉరీ ఘటన తర్వాత భారత సైన్యం అంతే ధీటుగా పాకిస్థాన్‌కు సమాధానం చెప్పింది..
1947లో ఏర్పడిన పాకిస్థాన్, 1971లో బంగ్దాదేశ్ (తూర్పు పాకిస్థాన్)ను కోల్పోయింది.. ఇక బలూచిస్థాన్ ప్రావిన్స్ కూడా ఆ దేశం నుండి విడిపోయేందుకు సిద్దమవుతోంది.. సింధ్ ప్రావిన్స్‌లో సింధ్ దేశ్ కోసం పోరాటం జరుగుతోంది.. అటు వాయువ్య సరిహద్దు ప్రావిన్స్‌లో గిరిజన తెగలు పక్తూనిస్థాన్ కోసం ఎప్పటి నుండో పోరాడుతున్నారు.. చివరకు పాకిస్థాన్ దేశం పంజాబ్ ప్రావిన్స్ (పశ్చిమ పంజాబ్)కే పరిమితం కానుందా?
'వినాశకాలే విపరీత బుద్ది..' చెరపకురా చెడేవు..' అన్నారు మన పెద్దలు.. పాకిస్థాన్ చేస్తున్న పని ఇదే.. తన గోరీని తానే తవ్వుకుంటోంది ఆ దేశం..