* సహజ రంగులతోనే హోలీ ఆడండి.. రసాయనాలు వద్దు..
ఎరుపు, గులాబి పొడులతో మాత్రమే ఆడేందుకు ప్రయత్నించండి..
*హోలీ ఆడే ముందు తలకు, ముఖానికి నూనె, చేతులకు
నూనె చక్కగా రాసుకోండి.. ముఖానికి మేకప్, క్రీములు రుద్దుకోవద్దు..
*పొడువైన దుస్తులు ధరించండి.. ఫలితంగా రంగులు
శరీరానికి ఎక్కవగా తగలకుంగా నివారించవచ్చు..
*రంగులు కళ్లలో పడకుండా జాగ్రత్తలు తీసుకోండి..
అలాగే మీరు ఇతరుల కళ్లలో వేయకండి..
*వీలైనంత వరకూ పెద్దగా ఉండే కూలింగ్ గ్లాస్
ధరించండి.. అలాగే చెవిలో దూది పెట్టుకోండి..
*హోలీ ఆడేందుకు ముందు మంచి నీరు బాగా తాగండి..
ఫలితంగా చమట బాగా వచ్చి రంగులు చర్మంలోకి పోకుండా కొంత మేర నివారించవచ్చు..
*నీటిలో రంగులు కలిపి చల్లుకుంటే చాలా నీరు వృధా
అవుతుంది.. ఎక్కువగా డ్రై కలర్స్ మాత్రమే ఉపయోగించండి..
*హోలీ ఆడిన తర్వాత కొబ్బరి నూనెతో తడిపిన బట్టతో
తుడుచుకోండి.. ఆ తర్వాత శుభ్రంగా తలంటి స్నానం చేయండి. తలంటుకు హెర్బల్ షాంపులు
మాత్రమే వాడండి.. సున్ని పిండి స్నానం మరీ మంచిది..
*హోలీ ఆడిన తర్వాత ముఖ్యంగా నోటిని, పండ్లను
శుభ్రంగా కడుక్కోండి.. హోలీ ఆడుతున్న సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకండి, రంగులు
పొట్టలోకి వెళ్లే ప్రమాదం ఉంది..
*హోలీ పండుగ తర్వాత కొద్ది రోజుల వరకూ మేకప్ కు
దూరంగా ఉండటం ముఖానికి మంచిది..
*రంగుల దుష్పలితాలపై ఏ మాత్రం అనుమానం వచ్చినా
వెంటనే డాక్టరును సంప్రదించండి..
పై జాగ్రత్తలను మీరు ఆచరించండి అలాగే ఇతరులకూ
తెలియజేయండి.. ఈ సందేశాన్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి.. మీ
క్రాంతి దేవ్ మిత్ర #
No comments:
Post a Comment