తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జ్ఞాపకాలను ప్రజల స్మృతిపథం
నుండి తొలగిస్తున్నారని మోదీ సర్కారుపై కొద్ది రోజుల క్రితం గయ్యిన లేచారు
కాంగ్రెస్ నాయకులు.. మరి నెహ్రూ స్థాపించిన కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక నేషనల్
హెరాల్డ్ ను మూసేసి, దాని ఆస్తులను తెగనమ్ముకొని సొంత ఖాతాలో వేసుకున్న సోనియా
గాంధీ, రాహుల్ రాహుల్ గాంధీలను ఎలా వెనుకేసుకు వస్తున్నారు వీరు?.. నెహ్రూ వారసులు
అయినంత మాత్రాన కుంభకొణానికి పాల్పడేందుకు వీరికి పేటెంట్ రైట్స్ ఉన్నాయా?.. పైగా
వీరేదో ఘన కార్యం చేసినట్లు అండగా నిలుస్తున్నారు.. చివరగా అర్థం అయింది ఏమిటంటే నెహ్రూ
జ్ఞాపకాలను నిర్మూలించే హక్కు ఆయన వారసులదే.. ఈ
విషయంలో మోదీకి ఎలాంటి చట్టబద్దమైన హక్కూ లేదు..
Saturday, December 19, 2015
అవార్డులు.. కండిషన్లు
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అందుకోనున్న
వారందరికీ అభినందనలు.. ఈ సందర్భంగా నాదో వినతి.. మీరు సాహితీ రంగంలో చేసిన సేవలకు
గుర్తింపుగా లభిస్తున్న ఈ అవార్డులు మీకే కాకుండా దేశ ప్రతిష్టకు కూడా గర్వకారణం..
కాబట్టి అవార్డుల విషయంలో రాజకీయాలను ముడిపెట్టకండి.. ‘అసహనకారుల’
ప్రభావంలో పడకండి..
ఇక కేంద్ర ప్రభుత్వానికి కూడా నాదో మనవి..
అవార్డులు ఇచ్చేప్పుడు ముందే షరతులు విధించండి.. రాజకీయ కారణాలతో అవార్డులు తిరిగి
ఇవ్వొద్దని స్పష్టంగా చెప్పండి.. ఒకవేళ అవార్డు వాపసు ఇస్తే, దానితో పార్టు ఇచ్చే
నగదును కూడా తిరిగి ఇవ్వాలనే షరతు విధించండి..
Thursday, December 17, 2015
వదంతులు ప్రచారం చేయకండి
నమ్మే వాడుంటే చేవిలో పువ్వు పెట్టేవాడు ఎప్పుడూ
సిద్దంగానే ఉంటాడు. ఇటీవల వాట్సప్, ఫేస్ బుక్, తరతర సోషల్ మీడియా మెసెంజర్
సర్వీసుల్లో వస్తున్న వదంతులు ఈ తరహాలోనివే.
‘ నరేంద్ర మోదీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా పథకం
కోసం 12 జీబీ డాటా, రూ.1029 టాక్ టైమ్ ఇస్తోంది.. దీన్ని 10 మంది మిత్రులకు షేర్
చేయాలి.. 5 నిమిషాల తర్వాత బ్యాలన్స్ వస్తుంది. ఇందు కోసం కింది మొబైట్ నెట్ వర్క్
నెంబర్స్ డయల్ చేయండి. ఇది చూసి నేను కూడా షాక్ అయ్యాను.. కానీ ఇది నిజం.
ప్రయత్నించండి.. ’
ఈ మెసేజ్ చూసి వారంతా నిజమేనని గుడ్డిగా
నమ్మేస్తూ అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నారు. కనీసం నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం
చేయడం లేదు. ప్రధాని మోదీ ప్రజలకు ఏమైనా లబ్ది చేకూర్చే పథకం ప్రారంభిస్తే
బహిరంగంగా ప్రకటిస్తారు.. పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు ఇచ్చి అందరికీ తెలిసేలా
చేస్తారు. కానీ ఇలా రహస్యంగా సోషల్ మీడియాలో మెజేజ్ వదంతులు వ్యాపింపజేయరు. కాస్త
ఇంగితంతో ఆలోచించండి. మీకు ఇలాంటి మెజేస్ వస్తే పంపిన వాడిని నిలదీయండి.. కనీసం
వాడు ప్రయత్నించి చూశాడా అపి ప్రశ్నించడండి.. ప్రయత్నించలేదని చెబితే, మరి ఎందుకు
మెజేస్ పంపావని అడగండి..
ఇలాంటి వదంతులను కట్టడి చేయడానికి ఇదొక్కటే
మార్గం..
స్నేహ హస్తం వెనుక మతలబు ఇదేనా?
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీతో
సంబంధాల విషయంలో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు.. ఇటీవలి కాలంలో రెండు సార్లు
విజయవాడ వెళ్లడం, ఏపీ సీఎం చంద్రబాబును తాను తలపెట్టిన యాగానికి ఆహ్వానించడం
పక్కా స్కెచ్ ప్రకారమే జరిగింది.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఉంది కేసీఆర్
ఎత్తుగడ.. స్నేహ హస్తం అందించడం ద్వారా ఆంధ్రా ప్రజలను సంతోషపరచడమే కాదు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో
హైదరాబాద్లోని సీమాంధ్రుల ఓట్లు సాధించాలని ఆయన భావించినట్లు తెలుస్తోంది.. పొరుగు
రాష్ట్రంతో సఖ్యతగా మెలగాలని కేసీఆర్ భావిస్తే మంచిదే.. అది జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత
కూడా కొనసాగాలి..
Wednesday, December 16, 2015
కేజ్రీ చట్టపట్టాల్ ఎవరితో?
మొన్న పాట్నాలో పశుగ్రామ కుంభకోణ నిందితుడు లాలూ
ప్రసాద్ యాదవ్ ను కౌగలించుకున్నాడు.. ఇవాళ ఏకంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన
ముఖ్యకార్యదర్శి రాజేంద్ర కుమార్ పై సీబీఐ దాడులను తప్పు పట్టాడు.. ఢిల్లీ సీఎం
అరవింద్ కేజ్రీవాల్ ఎందుకిలా మారిపోయాడు.. లోక్ పాల్ బిల్లు కోసం జరిగిన అన్నా
హజారే పోరాటాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకొని సీఎం పదవిని సంపాదించాడు కేజ్రీవాల్..
తన హద్దులను ఢిల్లీకే పరిమితం చేసుకొని ఉద్యమాన్ని గాలికొదిలేశాడు.. ఇప్పుడు ఏకంగా
అవినీతి పరులైన అధికారులకు అండగా నిలుస్తున్నాడు..
తనకు ముందుగా చెప్పి దాడులు చేయలేదని తప్పు
పడుతున్నాడు కేజ్రీవాల్.. సర్జీ మేము దాడులకు వస్తున్నాం, అంతా సర్దుకొని సిద్దంగా
ఉండండి అని సీబీఐ ముందుగానే సమాచారం ఇవ్వాలా?.. కేజ్రీవాల్ తో బంధం తెంచుకోవడం
మంచిదైందని ఇటీవల అన్నా హజారే వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి..
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై తన రాజకీయ
వ్యతిరేకతను చాటుకోవడానికి కేజ్రీవాల్ కు అనేక మార్గాలు ఉన్నాయి.. కానీ అవినీతి
విషయంలో ఇలా ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం ఆయన విశ్వసనీయను ప్రశ్నార్ధకం చేస్తోంది..
Tuesday, December 15, 2015
దేశం కన్నా కుటుంబమే మిన్న..
1978 డిసెంబర్ మాసంలో లక్నో నుండి ఢిల్లీ వెళ్లుతున్న ఇండియన్ ఎయిర్ లైన్స్
విమానం హైజాక్ అయింది. కారణం: ఇందిరా గాంధీని అరెస్టు
చేశారని.. 2015 డిసెంబర్ మాసంలో పార్లమెంటు సమావేశాలకు ఆటంకం. కారణం: సోనియా గాంధీని తన ఎదుట హాజరు కమ్మని న్యాయ స్థానం ఆదేశించినందుకు..
రెండు ఘటనలకు 37 ఏళ్ల తేడా.. కానీ రెండు చర్యలకు కారణం కాంగ్రెస్ పార్టీయే.. నాడు,
నేడూ ఒక కుటుంబాన్ని రక్షించడానికి చేసిన పనే..

ఆనాడు
కేంద్రంలో జనతా పార్టీ అధికారంలో ఉంది.. రాజకీయ ప్రేరిత కుట్రలో భాగంగా ఇందిరను
అరెస్టు చేశారని కాంగ్రెస్ నాయకుల ఆరోపణ.. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది.. సోనియా
గాంధీ విషయంలోనూ రాజకీయ కుట్రే అని కాంగ్రెస్ వాదన.. ఏది నిజం? ఏది అవాస్తవం?..
1978,
2015.. ఈ రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారు ఒక కుటుంబానికి చెందిన వారు..
వారిపై చర్యలు చేపట్టింది న్యాయస్థానమే.. రెండింటిలోనూ ప్రభుత్వాల ప్రమేయం ఏమాత్రం
లేదు.. వారు చేసిన తప్పుల ఫలితం కారణంగానే కేసుల్లో ఇరుక్కున్నారు.. కానీ
కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది..
మరీ
విచిత్రం ఏమిటంటే ప్రస్తుత నేషనల్ హెరాల్డ్ కేసు 2013లో నమోదైంది.. నాడు అధికారంలో
ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.. న్యాయ స్థానాలపై అధికార పార్టీల ప్రభావం ఉందని వారు
భావించనట్లయితే, ఆనాడే కేసు నమోదు కాకుండా అడ్డుకోవచ్చుకదా?.. బీజేపీ నాయకుడు
సుబ్రహ్మణ్య స్వామి కేసు నమోదు చేసినంత మాత్రాన, దాన్ని ప్రభుత్వానికి
ఆపాదించడానికి ప్రయత్నించడమేనా?
ఇంతకీ
తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్థాపించిన కాంగ్రెస్ అధికార పత్రిక ఆస్తులను ఒక
కుటుంబం అడ్డగోలుగా అమ్ముకొని తమ వ్యక్తిగత ఖాతాల్లో వేసుకుంటే ఆ పార్టీ నాయకులు
వెనుకేసుకురావడం ఎంత వరకూ సమంజసం?.. కాంగ్రెస్ పార్టీ ఆ వ్యక్తుల కుటుంబ ఆస్తిగా
భావిస్తున్నారా?.. దేశంకన్నా కుటుంబమే మిన్న అని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోందా?.. ఏప్రిల్
ఇంకా నాలుగు నెలల దూరంలో ఉంది.. మరి ఎవరిని ఫూల్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు..
దేశ ప్రజలనా?.. ప్రజలు అంత అమాయకులుకాదు మోసపోవడానికి..
Sunday, December 13, 2015
Subscribe to:
Posts (Atom)





