భారత్
లో అసహనం పెరిగిపోతోందట.. అందుకే దేశం విడిచిపోదామని తన భార్య కిరణ్ రావు
ప్రతిపాదించిందని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ వాపోయాడు.. నిజంగా ఈ దేశ ప్రజల్లో
అసహనమే ఉంటే వీరి సినిమాలు ఇంత స్వేచ్ఛగా ఎలా ఆడుతున్నాయి.. ఈ సినిమాలను
చూస్తున్నది ఎవరు? మన దేశ ప్రజలు కాదా? తమ సినిమాలకు కోట్లాది మంది భారతీయుల ఆదరణను
సొమ్ము చేసుకొని, కోటాను కోట్లు రూపాయల ధనం ఆర్జించడం వాస్తవం కాదా?.. మరి అమీర్
ఖాన్ కుటుంబానికి అసహనం ఎక్కడ కనిపించింది?.. అసహనానికి సంబంధించిన ఉదాహరణ ఇవ్వకుండా,
దుష్ప్రచారానికి దిగడం దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం దేశ ద్రోహం కాదా?.. ఇంతకీ
వీరు భారత్ ను విడిచి ఏ దేశానికి పోతారు?.. ఆ దేశాలు భద్రమైనవేనా?.. వీరి భద్రతకు అక్కడ
పూచీ ఎవరు?.. అసలు సామాన్య ప్రజలకు ఎక్కడా కనిపించని అసహనం ఈ సెలబ్రిటీలకే ఎందుకు
కనిపిస్తోంది.. ఇందులో ఏమైనా కుట్ర ఉందా?.. రాజకీయ ప్రేరితమా?.. ఆలోచించండి..
No comments:
Post a Comment