Friday, May 3, 2013

కంటికి కన్ను.. పంటికి పన్ను

కంటికి కన్ను, పంటికి పన్ను.. ఈ తరహా శిక్షలు ఆధునిక సమాజంలో అనాగరికం, ఆటవికం అనిపిస్తాయి.. కానీ నేటి న్యాయ వ్యవస్థలో ఏళ్ల తరబడి కొనసాగే కేసులు, ఎప్పటికో కానీ జరగని న్యాయం చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది.. కొన్ని సందర్భాల్లో బాధితులు ఊహించని ప్రతికూల తీర్పు వస్తే వారి మనోవేదన ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించండి? 
1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో వేలాది మంది సిక్కుల ఊచకోత జరిగింది.. ఓ మహా వృక్షం నేల కూలితే దాని కింద ఉన్న మొక్కలకూ హాని జరగడం సహజం అని నాటి ప్రధాని రాజీవ్ గాంధీ సమర్ధించుకున్నాడు.. 29 ఏళ్ల తర్వాత నాటి అకృత్యాలకు నాయకత్వం వహించిన వారిలో ప్రముఖుడైన సజ్జన్ కుమార్ అనే కాంగ్రెస్ నేత నిర్ధోషి అని తేల్చేసింది న్యాయస్థానం.. మరోవైపు చేయని నేరానికి పాకిస్థాన్ జైళ్లో 23 ఏళ్లుగా మగ్గి చివరకు హత్యకు గురైన సరబ్ జీత్ సింగ్ గురుంచి ఒక్కసారి ఆలోచించండి.. 
సరబ్ జీత్ సింగ్ హత్యకు ప్రతీకారంగా జమ్మూలోని కోట్ బల్వాల్ జైలులో పాకిస్థాన్ ఖైదీ సనావుల్లాను తోటి ఖైదీ చావగొట్టాడు.. నేను ముందుగా ప్రస్థావించిన కంటికి కన్ను సిద్దాంతం ఇదే.. ఈ తరహా న్యాయం మేధావులకు నచ్చక పోవచ్చు కానీ పీడితులైన వారికి ( వివరంగా చెప్పాలంటే ఢిల్లీ బాధిత సిక్కులకు, పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని తహ తహలాడుతున్న భారతీయ ఖైదీలకు) కంటికి కన్ను, పంటికి పన్ను లాంటి సిద్ధాంతాలే నచ్చుతాయి..
సత్యమేవ జయతే..

No comments:

Post a Comment