Thursday, May 2, 2013

సర్దార్జీల ఉసురు తగలక మానదు

ఒకవైపు సరబ్ జిత్ సింగ్ మరణం, మరోవైపు 1984 ఢిల్లీ అల్లర్ల విషయంలో సీబీఐ కోర్టు తీర్పు.. రెండూ సిక్కులకు విశాదాన్ని మిగిల్చిన పరిణామాలు..

పాకిస్తాన్ జైళ్లో రెండు దశాబ్దాలు మగ్గి చివరకు హత్యకు గురయ్యాడు సరబ్.. ఆయన్ని విడిపించే విషయంలో విఫలమైన మన ప్రభుత్వం, జైలులో హత్యాప్రయత్నం తర్వాతైనా సరబ్ జిత్ కు మెరుగైన చికిత్స కోసం స్వదేశానికి తీసుకురావడంలో చొరవ చూపలేకపోయింది..
ఇందిరాగాంధీ హత్య తర్వాత వేలాది మంది సిక్కులను ఊచకోత కోయించిన నేరగాళ్లలో ప్రముఖుడైన కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ నిర్దోషి అని సీబీఐ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది.. బాధిత సిక్కు కుటుంబాలకు అంతులేని ఆవేదన కలిగించిన తీర్పు అది..
ఈ దేశానికి ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ స్వయానా సిక్కు.. అయినా సిక్కులకు న్యాయం చేయలేక పోయారాయన..  సర్దార్జీల ఉసురు యూపీఏ ప్రభుత్వానికి తగలక తప్పదు..

No comments:

Post a Comment