Tuesday, December 27, 2016
బీకామ్ లో ఫిజిక్స్ అట..
కళాకారుడి ముసుగులో బరితెగింపు
Tuesday, December 20, 2016
వీరికి ఉరి కన్నా భయంకర శిక్షలు అవసరం
Thursday, December 15, 2016
చాయ్ జాతీయ పానీయం కావాలి..
గరం గరం చాయ్.. ఇది లేనిదే నాకు రోజు గడవదు.. దాదాపు భారతీయులందరి పరిస్థితి ఇంతే అనుకుంటాను..బ్రిటిష్ వాడు పోతూ పోతూ మనకు అంటించిన వ్యసనం అంటారు.. వ్యసనం అనే కంటే బహుమతి అనడం సబబేమో..
శరీరానికి ఉత్తేజాన్ని కలిగించే తేనీటిని పెద్దలు మొదట్లో అనుమానంగానే చూశారు.. నిజానికి ఇందులో కెఫేన్ ఉన్నా ఇది అంతగా అనారోగ్యాన్ని కలిగించేంది కాదు.. పైగా టీ లోని బి విటమిన్, రొబోప్లేవిన్, నియాన్ తదితర పదార్ధాలు శరీరానికి మేలు చేసేవే.. ముఖ్యంగా క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నట్లు గుర్తించారు.. అయితే ఏ విషయంలో అయినా అతి పనికి రాదు.. ఇది టీకీ వర్తిస్తుంది.. చాయ్ అదే పనిగా తాగితే మన శరీరం ఇతర ఆహార పదార్ధాలను స్వీకరించడం కష్టమవుతుంది.. రోజుకు రెండు లేదా మూడు కప్పులకే టీని పరిమితం చేసుకోవండం ఉత్తమం..
నాబోటీ పక్కా హైదరాబాదీలకు చాయ్ అంటే పంచ ప్రాణాలతో సమానం.. ఇరానీ చాయ్ గురుంచి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నా అందులో రుచి తప్ప సాధారణ టీతో పోలిస్తే పెద్దగా సుగుణాలు ఏవీ లేవు. నిజామ్ పాలకుల సమయంలో కొందరు ఇరానీ వ్యాపారులు దక్కన్ కు చాయ్ పరిచయం చేయడం వల్ల ఇరానీ చాయ్ అనే బ్రాండ్ వ్యాప్తిలోకి వచ్చింది.. నిజానికి మనం తాగే చాయ్ ఇరాన్ లో ఎక్కడా తాగరు.. మనం మాత్రం ఆ పేరు చెప్పుకొని లొట్టలేసుకుంటూ జుర్రు కుంటాం.. గత దశాబ్ద కాలంగా నగరానికి పరిచయం అయిన రోడ్ సైడ్ డబ్బా టీ సెంటర్లు సాంప్రదాయ చాయ్ కు గట్టి పోటీ ఇస్తునా అందులో రుచీ పచీ ఉండదు.. సాధారణంగా మనం తాగున్న టీ కన్నా సహజ సిద్దమైన గ్రీన్ టీతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.. ప్రయత్నించండి..
ఒక చాయ్ వాలా మన దేశానికి ప్రధానమంత్రి కావడం కూడా గర్వకారణం.. ప్రపంచంలో అత్యధికంగా తేయాకును ఉత్పత్తి చేస్తున్నది, తేనీటిని తాగుతున్నది భారత దేశంలోనే.. చాయ్‌ను జాతీయ పానీయంగా ప్రకటించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది.. ఈ కోరికను మన ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చాలని కోరుకుంటున్నాను..
ఇవాళ అంతర్జాతీయ తేనీటి దినోత్సవం (డిసెంబర్15).. అందుకే ఈ చాయ్ కీ బాత్..
Saturday, December 10, 2016
స్పూర్తినిచ్చే భగవద్గీత
తెలుగువారికి ఘంటసాల ఆలపించిన భగవద్గీతతో పరిచయం ఎక్కువ..
భగవద్గీత భారత జాతీయోధ్యమం, ఆధ్యాత్మిక, తాత్విక, సాంస్కృతిక పునర్జీవనాలకు స్పూర్తిని ఇచ్చింది.. మహర్షి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, బాలగంగాధర్ తిలక్, మహాత్మగాంధీ, బంకించంద్ర చటోపాధ్యాయ, అరబిందో ఘోష్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీర్ సావర్కార్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాంప్రసాద బిస్మిల్, ఖుదీరాంబోస్, సుఖ్ దేవ్, రాజగురు, ఉద్దాం సింగ్ లాంటి ఎందరో మహనీయులు, వీరులు భగవద్గీత నుండి స్పూర్తిని పొందారు..
మరి కొందరు భవవద్గీతను పదవీ విరమణ తర్వాత కాలక్షేపం కోసం చదువుతారు.. కానీ జీవిత చరమాంకంలో మాత్రమే గీతను చదువుకోవడం వల్ల ఏం లాభం? ముందుగానే చదువుకుంటే వారు తమ జీవితాలను మరింత ఫలవంతంగా తీర్చి దిద్దుకునేవారు కదా?
భగవద్గీత కేవలం హిందువులదేనా?.. అలా అని శ్రీకృష్ణుడు ఎక్కడా అందులో చెప్పలేదే.. మానవ జీవితాన్ని మార్చేసిన ఆవిష్కరణలు, సిద్దాంతాలు ఒక మతానికే పరిమితం కాలేదు కదా? మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన గీతాన్ని ఒక మతంతో ముడి పెట్టడం సమంజసమేనా? హిందుత్వం ఒక జీవన విధానం.. భగవద్గీత ఈ ధర్మాన్ని ఆచరించే వారి జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది.. అన్య మత విశ్వాసులకు ఈ అదృష్టం ఎందుకు దక్కరాదు?
నేడు గీతాజయంతి.. మార్గశీర్ష మాసం శుద్ధ ఏకాదశి రోజున భగవద్గీత ఆవిర్భవించింది.. ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..
Thursday, December 8, 2016
రాజకీయ వ్యంగ్యానికి చిరునామాకు ఆశ్రునివాళి
Tuesday, December 6, 2016
Saturday, December 3, 2016
జాతీయ గీతం కూడా వివాదమేనా?
దేశ ప్రజల్లో మాతృభూమి, జాతీయ గీతం, చిహ్నాల పట్ల విధేయత, ప్రేమ, భక్తి, గౌరవం కచ్చితంగా ఉండాలి.. ఇవి లోపించడం వల్లే మన దేశంలో ఉగ్రవాదం, వేర్పాటు వాదం పెరిగిపోతోంది.. దేశ భక్తిని మతంతో ముడిపెట్టరాదు... ఇంత వరకూ మనకు ఎలాంటి అభిప్రాయ బేధాలు ఉండాల్సిన అవసరం లేదు.. కానీ..
సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన ఎలా స్వాగతించాలో అర్థం కావడం లేదు.. జాతీయ గీతం ఆలపించే సమయంలో విధిగా లేచి నిలబడి గౌరవాన్ని ప్రకటించాలి.. వీలైతే మనమూ ఆలపించాలి.. సినిమాలు చూడటానికి వచ్చేవారిలో రకరకాల వ్యక్తులు ఉంటారు.. తాగుబోతులు, జూదరులు, వ్యభిచారులు, రౌడీలు, చిల్లర దొంగలు.. ఇలా రకరకాల అసాంఘిక శక్తులు హళ్లలోకి వస్తుంటారు.. వీరి నుండి మనం ఎలాంటి దేశభక్తిని ఆశించగలం?
మరోవైపు ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో హింస, శృంగారం, ద్వంద్వార్థాలు, వెలికి హాస్యం అధికంగా ఉంటున్నాయి.. పెద్దలకు మాత్రమే, ‘ఏ’ గ్రేడు చిత్రాలు సరేసరి.. ఇలాంటి చిత్రాలు ప్రదర్శిస్తున్న హాలులో జాతీయ గీతాన్ని ఎలా ఆలపించగలం?.. న్యాయస్థానాలు తీర్పు ఇచ్చే ముందు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే బాగుండేది.. అయితే దేశభక్తి, సందేశాత్మక, మంచి చిత్రాలు ప్రదర్శించినప్పు జాతీయ గీతం ఆలపిస్తే చాలా బాగుంటుంది.. విచిత్రం ఏమిటంటే న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో బీజేపీ, సంఘ్ పరివార్ కు సంబంధం లేదు.. అయినా కొందరు వ్యక్తులు, సంస్థలు, మీడియా అప్పుడే ఈ సంస్థలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నాయి.. దేశభక్తి వీరికి మాత్రమే పేటెంట్ హక్కా?
జాతీయ గీతాన్ని కేవంలం పవిత్రమైన స్థలాల్లోనే ఆలాపించాలి అని నా భావన.. ఉదాహరణకు బహిరంగ సభలు, ప్రభుత్వ – ప్రైవేటు కార్యక్రమాలు, పార్టీల సభలు, చర్చాగోష్టులు, విద్యాసంస్థలు.. ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ సహాయంతో నడిచే ప్రతి సంస్థలోనూ జాతీయ గీతం ఆలపించాల్సిందే.. ఇంత వరకూ ఎవరికీ అభ్యంతరం ఉందు.. చివరగా కోర్టుల్లో జాతీయ గీతం అవసరం లేదు అని ధర్మాసనం వారు తమ నిర్ణయాన్ని సవరించుకోవాల్సిందినా నా మనవి..