2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రధాని మన్మోహన్
సింగ్ గారికి, ఆర్థిక మంత్రి చిదంబరం గారికి ఏ పాపమూ తెలియదట? టెలికాం మంత్రి రాజా
ప్రధానిని తప్పుదోవ పట్టించారట.. యూపీఏ హయాంలో జరిగిన 2జీ స్కామ్ వల్ల ఖజానాకు రూ.
1.76 లక్షల కోట్లు నష్టం వచ్చిందనేమాట శుద్ద అబద్దమట.. తప్పందా ఎన్డీఏ హయంలో
ప్రధాన మంత్రిగా పని చేసిన వాజ్ పేయి, ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్, టెలికాం
మంత్రులుగా పని చేసిన ప్రమోద్ మహాజన్, అరుణ్ శౌరీలదేనట.. వారు తీసుకున్న నిర్ణయాల
వల్ల మైగ్రేషన్ విధానం వల్ల దేశ ఖజానాకు రూ. 43 వేల కోట్ల నష్టం వచ్చిందంట..
ఇదండీ చాకోపాఖ్యానం.. 2జీ కుంభకోణంపై ఏర్పాటు
చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ పీసీ చాకో సమర్పించిన నివేదిక
సారాంశమిది..
ఈ దేశంలో టెలికమ్యూనికేషన్ విప్లవం వెల్లి
విరియడానికి కారకులు ఎవరు.. కాల్ ఛార్జీ నిమిషానికి 16, 8 రూపాయల నుండి 1 రూపాయి దిగువకు
తగ్గించి, సామాన్య ప్రజలకు సైతం మొబైల్ ఫోన్ అందుబాటులోకి తెచ్చిన ఘనత ఎవరిది? వాజ్
పేయి హయాంలో తీసుకున్న నిర్ణయాల పుణ్యమా అని దేశంలో సమాచార సాంకేతిక విప్లవం కొత్త
పుంతలు తొక్కి, కొత్తగా ఉన్నో ఉపాధి అవకాశాలు వచ్చాయి.. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన
పడింది.. వాస్తవాలు ఇలా ఉంటే అటల్జీ, జస్వంత్, మహాజన్, శౌరీలపై బురద చల్లడం
ఎందుకు? ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వారు అడ్డగోలుగా అవినీతికి పాల్పడి,
ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు కూడబెట్టుకున్న ఆధారాలు ఏమైనా ఉన్నాయి..
వెనుకటికి ఒకడు తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా? అని
అడిగితే దూడ గడ్డి కోసం అన్నాడట.. చాకో గారి వ్యవహారం ఇలాగే ఉంది.. 2జీ స్కామ్
నిజాలు నిగ్గు తేల్చమంటే అసలు విషయం వదిలేసి, ప్రభుత్వ పెద్దలకు క్లీన్ చీట్
ఇచ్చేసి.. వెనుకటి ప్రభుత్వానికి మరకలంటించాడు.. రాజాగా గారే తప్పు మన్మోహన్జీకీ ఏ
పాపమూ తెలియదు అంటే నమ్మేది ఎవరు? అత్యున్నత పదవిలో ఉండే వారు దేశ ప్రజల సొత్తును
కాపాడాలే కాని దొంగలను వెనుకేసుకు వస్తారా?
No comments:
Post a Comment